Kaamini yappadanumdi kaasugunnadi neevela

కామిని యప్పటనుండి కాచుకున్నది నీవేళ
Language

(॥పల్లవి॥)
కామిని యప్పటనుండి కాచుకున్నది నీవేళ
ప్రేమము నీకుఁ జేసె ప్రియము చేకోవయ్యా

(॥కామి॥)
పలుకులఁ గొసరీని భామ నీతో సారెసారె
చెలుములు సేసీని చెనకులను
వలపులు చల్లీని వాడికమొక్కులను
పిలిచీ వింటికి నిన్నుఁ బ్రియముచేకొవయ్యా

(॥కామి॥)
ననుపులు సేసీని నయముల నవ్వుల
చనవిమ్మని యడిగీ సరసముల
వునుకులు చెప్పీని వుడివొనిసన్నల
పెనఁగీ నీరతులకు ప్రియము చేకోవయ్యా

(॥కామి॥)
వదలుఁబయ్యద చూపి వలపు నీపై నించి
గుదిగుచ్చీ వాపులు కొలువులోన
యిదె శ్రీవేంకటేశ్వర యీకె యలమేలుమంగ
పెదవితేనె లొనఁగీ ప్రియము చేకోవయ్యా

(||pallavi||)
kāmini yappaḍanuṁḍi kāsugunnadi nīveḽa
premamu nīgum̐ jesĕ priyamu segovayyā

(||kāmi||)
palugulam̐ gŏsarīni bhāma nīdo sārĕsārĕ
sĕlumulu sesīni sĕnagulanu
valabulu sallīni vāḍigamŏkkulanu
pilisī viṁṭigi ninnum̐ briyamusegŏvayyā

(||kāmi||)
nanubulu sesīni nayamula navvula
sanavimmani yaḍigī sarasamula
vunugulu sĕppīni vuḍivŏnisannala
pĕnam̐gī nīradulagu priyamu segovayyā

(||kāmi||)
vadalum̐bayyada sūbi valabu nībai niṁchi
gudiguchchī vābulu kŏluvulona
yidĕ śhrīveṁkaḍeśhvara yīgĕ yalamelumaṁga
pĕdavidenĕ lŏnam̐gī priyamu segovayyā