కాఁగిటికి వచ్చి నీవు కలసినప్పుడుగాక
(॥పల్లవి॥)
కాఁగిటికి వచ్చి నీవు కలసినప్పుడుగాక
మాఁగిన మోవి చూపఁగ మరి లాభమేమి
(॥కాఁగి॥)
జట్టిగొని నాతోను సరసములాడేవు
వట్టి జోలి దవ్వఁగాను వచ్చేదేమి
చుట్టి చుట్టి యప్పటిని చుట్టరికాలు చెప్పేవు
బట్టబయ లందులో పనిగొనే దేమి
(॥కాఁగి॥)
నానఁబెట్టి నీవు నాతో నవ్వులెల్లా నవ్వఁగాను
పూనిపట్టి ఇంతలోనే పొందేదేమి
మానలేక పై పై యెడమాట లిట్టె యాడించఁగా
కానిమ్మని ఇఁక మరి కట్టుకొనే దేమి
(॥కాఁగి॥)
తేరకొని నాదిక్కే దిష్టించి చూడఁగాను
మేరమీరి నాపంతము మెరసేదేమి
గారవించి నన్నేలితి గక్కన శ్రీ వేంకటేశ
కోరికె చెల్లెను యింకాఁ గొసరేదేమి
(||pallavi||)
kām̐giḍigi vachchi nīvu kalasinappuḍugāga
mām̐gina movi sūbam̐ga mari lābhamemi
(||kām̐gi||)
jaṭṭigŏni nādonu sarasamulāḍevu
vaṭṭi joli davvam̐gānu vachchedemi
suṭṭi suṭṭi yappaḍini suṭṭarigālu sĕppevu
baṭṭabaya laṁdulo panigŏne demi
(||kām̐gi||)
nānam̐bĕṭṭi nīvu nādo navvulĕllā navvam̐gānu
pūnibaṭṭi iṁtalone pŏṁdedemi
mānalega pai pai yĕḍamāḍa liṭṭĕ yāḍiṁcham̐gā
kānimmani im̐ka mari kaṭṭugŏne demi
(||kām̐gi||)
teragŏni nādikke diṣhṭiṁchi sūḍam̐gānu
meramīri nābaṁtamu mĕrasedemi
gāraviṁchi nannelidi gakkana śhrī veṁkaḍeśha
korigĕ sĕllĕnu yiṁkām̐ gŏsaredemi