కాఁగల మేలెల్లా నేఁడే కలిగీఁగాన
(॥పల్లవి॥)
కాఁగల మేలెల్లా నేఁడే కలిగీఁగాన
మాఁగిన మోవుల మీరు మచ్చికఁ బొగడరే
(॥కాఁగ॥)
చిత్తమే చిమ్మిరేఁగితే చెలువుఁ డేమిసేసునే
హత్తి మీరు కేరడము లాడేరుగాక
బత్తి నేఁ జేసినదే పైకొని యలయించఁగా
కొత్తలుగాఁ జందమామఁ గొసరఁగ నేఁటికే
(॥కాఁగ॥)
జవ్వనమే తరవైతే సకు లేమిసేతురే
ఇవ్వల మీరేల నేరాలెంచుకొనేరే
నవ్విన నానవ్వులే నన్నుఁ బెనఁగించఁగాను
పువ్వు వంటి మరునిఁ దప్పులు వట్టనేఁటికే
(॥కాఁగ॥)
చుట్టరికమే మించితే చూచి నే నేమిసేతునే
గుట్టుతోడనే ఇయ్యకొనఁదగును
ఇట్టె శ్రీవేంకటేశుఁ డేలి నన్ను మన్నించఁగా
చుట్టి నానోము ఫలము సొదించ నేఁటికే
(||pallavi||)
kām̐gala melĕllā nem̐ḍe kaligīm̐gāna
mām̐gina movula mīru machchigam̐ bŏgaḍare
(||kām̐ga||)
sittame simmirem̐gide sĕluvum̐ ḍemisesune
hatti mīru keraḍamu lāḍerugāga
batti nem̐ jesinade paigŏni yalayiṁcham̐gā
kŏttalugām̐ jaṁdamāmam̐ gŏsaram̐ga nem̐ṭige
(||kām̐ga||)
javvaname taravaide sagu lemisedure
ivvala mīrela nerālĕṁchugŏnere
navvina nānavvule nannum̐ bĕnam̐giṁcham̐gānu
puvvu vaṁṭi marunim̐ dappulu vaṭṭanem̐ṭige
(||kām̐ga||)
suṭṭarigame miṁchide sūsi ne nemisedune
guṭṭudoḍane iyyagŏnam̐dagunu
iṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍeli nannu manniṁcham̐gā
suṭṭi nānomu phalamu sŏdiṁcha nem̐ṭige