Kaallagajja kamkaalammaa

కాళ్ళగజ్జ కంకాళమ్మా
Year
Language

పల్లవి:

కాళ్ళగజ్జ కంకాళమ్మా.. కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా
వేగుచుక్కా వెలగ పండు.. బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా
పెళ్ళీ అంటే.. చుక్క పెట్టుకొచ్చా ఆ ఆ
రమ్మన్నావంటే.. గజ్జెలేసుకొచ్చా ఆ ఆ
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా ఆ ఆ
రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా ఆ ఆ

హోయ్ కాళ్ళగజ్జ కంకాళమ్మా హ హ కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా హ హ హ

చరణం 1:

నిన్ను చూడగానే నాకు వయసు తెలిసింది
వయసు తెలియగానే పెళ్ళి గురుతుకొచ్చింది
కాళ్ళ మట్టెలు.. రాళ్ళ పోగులు.. ఎర్ర గాజులు.. నల్ల పూసలు సిద్ధం చేశాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను

పెళ్ళి అనగానే నువ్వు గుర్తుకొచ్చ్చావు
నువ్వు గురుతు రాగానే ఆశ చచ్చిపోయింది
కాషాయాలు.. కమండలలౌ.. రుద్రాక్షలు.. పులిచర్మాలు సిద్ధం చేశాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను

అరెరెరెరే కాళ్ళగజ్జ కంకాళమ్మా.. హ హ.. కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా.. హ హ హ..
అరె వేగుచుక్కా వెలగ పండు.. హ హ హ.. బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా హా హా హా

చరణం 2:

పువ్వు పుట్టగానే గుప్పు గుప్పు మంటుంది
నేను పుట్టగానే నువ్వు నువ్వు అన్నాను
వెండి కంచము.. పందిరి మంచము.. గాలి పింఛము.. పూలగుచ్చము సిద్ధం చేశాను
నువ్వు ఊఁ అంటే తలుపుకి గడియ పెట్టేస్తాను
నువ్వు ఊఁ అంటే తలుపుకి గడియ పెట్టేస్తాను

రాతిరిపూట కలలోకి నువ్వే వచ్చావు
జాతరలోని అమ్మోరుని గుర్తుకు తెచ్చావు
వేప మండలు.. కల్లు కుండలు.. కోడి పెట్టలు.. పసుపు బట్టలు సిద్ధం చేసాను
నువ్వు ఊఁ అంటే జాతర పెట్టేస్తాను
నువ్వు ఊఏం అంటే జాతర పెట్టేస్తాను

అరె అహా కాళ్ళగజ్జ కంకాళమ్మా.. హ హ.. కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా.. హ హ హ..
అరె వేగుచుక్కా వెలగ పండు.. హ హ హ.. బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా ఆ ఆ ఆ
రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా ఓ ఓ ఓ
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా
రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా
లా లా లా.....

pallavi:

kāḽḽagajja kaṁkāḽammā.. kāḽḽagu gājjĕlu ĕkkaḍivammā
vegusukkā vĕlaga paṁḍu.. buggana sukka ĕkkaḍidammā
pĕḽḽī aṁṭe.. sukka pĕṭṭugŏchchā ā ā
rammannāvaṁṭe.. gajjĕlesugŏchchā ā ā
pĕḽḽī aṁṭe..sukka pĕṭṭugŏchchā ā ā
rammannāvaṁṭe gajjĕlesugŏchchā ā ā

hoy kāḽḽagajja kaṁkāḽammā ha ha kāḽḽagu gājjĕlu ĕkkaḍivammā ha ha ha

saraṇaṁ 1:

ninnu sūḍagāne nāgu vayasu tĕlisiṁdi
vayasu tĕliyagāne pĕḽḽi gurudugŏchchiṁdi
kāḽḽa maṭṭĕlu.. rāḽḽa pogulu.. ĕrra gājulu.. nalla pūsalu siddhaṁ seśhānu
nuvvu ūm̐ aṁṭe raṁgaṁlogi digibodānu
nuvvu ūm̐ aṁṭe raṁgaṁlogi digibodānu

pĕḽḽi anagāne nuvvu gurdugŏchchchāvu
nuvvu gurudu rāgāne āśha sachchiboyiṁdi
kāṣhāyālu.. kamaṁḍalalau.. rudrākṣhalu.. pulisarmālu siddhaṁ seśhānu
nuvvu ūm̐ aṁṭe raṁgaṁlogi digibodānu
nuvvu ūm̐ aṁṭe raṁgaṁlogi digibodānu

arĕrĕrĕre kāḽḽagajja kaṁkāḽammā.. ha ha.. kāḽḽagu gājjĕlu ĕkkaḍivammā.. ha ha ha..
arĕ vegusukkā vĕlaga paṁḍu.. ha ha ha.. buggana sukka ĕkkaḍidammā hā hā hā

saraṇaṁ 2:

puvvu puṭṭagāne guppu guppu maṁṭuṁdi
nenu puṭṭagāne nuvvu nuvvu annānu
vĕṁḍi kaṁchamu.. paṁdiri maṁchamu.. gāli piṁchhamu.. pūlaguchchamu siddhaṁ seśhānu
nuvvu ūm̐ aṁṭe talubugi gaḍiya pĕṭṭestānu
nuvvu ūm̐ aṁṭe talubugi gaḍiya pĕṭṭestānu

rādiribūḍa kalalogi nuvve vachchāvu
jādaraloni ammoruni gurdugu tĕchchāvu
veba maṁḍalu.. kallu kuṁḍalu.. koḍi pĕṭṭalu.. pasubu baṭṭalu siddhaṁ sesānu
nuvvu ūm̐ aṁṭe jādara pĕṭṭestānu
nuvvu ūeṁ aṁṭe jādara pĕṭṭestānu

arĕ ahā kāḽḽagajja kaṁkāḽammā.. ha ha.. kāḽḽagu gājjĕlu ĕkkaḍivammā.. ha ha ha..
arĕ vegusukkā vĕlaga paṁḍu.. ha ha ha.. buggana sukka ĕkkaḍidammā
pĕḽḽī aṁṭe..sukka pĕṭṭugŏchchā ā ā ā
rammannāvaṁṭe gajjĕlesugŏchchā o o o
pĕḽḽī aṁṭe..sukka pĕṭṭugŏchchā
rammannāvaṁṭe gajjĕlesugŏchchā
lā lā lā.....