Kaalam kaani kaalamlo

కాలం కాని కాలంలో
Year
Language

పల్లవి:

చిగురుల పూవ్వుల సింగారముతో.. తీవెలు సొంపులు గనలే.. దు
ముసిముసి నవ్వుల గిలిగింతలతో.. వసంత ఋతువా... రానే లేదు

కాలం కాని కాలంలో.. కోయిల కూతలెందుకనో
తరుణం కాని తరుణంలో.. నా మది.. ఈ గుబులెందుకనో..

కాలం కాని కాలంలో.. కోయిల కూతలెందుకనో

చరణం 1:

వలుపులు మీటగ.. తీయని పాటలు.. హృదయవీణపై పలికెనుగా..
ప్రియతము గాంచిన ఆనందములో.. మనసే... వసంత ఋతువాయెనుగా!

కాలం కాని కాలంలో.. కోయిల కూతలందుకనే
తరుణం కాని తరుణంలో.. నీ మది.. ఆ గుబులందుకనే..
కాలం కాని కాలంలో.. కోయిల కూతలందుకనే

చరణం 2:

తళుకుబెళుకుళ తారామణులతో.. శారదరాత్రులు రాలేదు
ఆకాశంలో పకపకలాడుచు.. రాకాచంద్రుడా... రానే లేదు!

కాలం కాని కాలంలో.. చల్లని వెన్నెల యెందుకనో..
తరుణం కాని తరుణంలో.. నా మది.. ఈ గుబులెందుకనో..
కాలం కాని కాలంలో.. చల్లని వెన్నెల యెందుకనో

చరణం 3:

తలచిన తలపులు ఫలించగలవని.. బులపాటము బలమాయెనుగా..
పగటి కలలుగను కన్యామణులకు.. ప్రియుడే... రాకాచంద్రుడుగా!

కాలం కాని కాలంలో.. చల్లని వెన్నెల అందుకనే..
తరుణం కాని తరుణంలో.. నీ మది.. ఆ గుబులందుకనే..
కాలం కాని కాలంలో.. చల్లని వెన్నెల అందుకనే

pallavi:

sigurula pūvvula siṁgāramudo.. tīvĕlu sŏṁpulu ganale.. du
musimusi navvula giligiṁtalado.. vasaṁta ṛtuvā... rāne ledu

kālaṁ kāni kālaṁlo.. koyila kūdalĕṁdugano
taruṇaṁ kāni taruṇaṁlo.. nā madi.. ī gubulĕṁdugano..

kālaṁ kāni kālaṁlo.. koyila kūdalĕṁdugano

saraṇaṁ 1:

valubulu mīḍaga.. tīyani pāḍalu.. hṛdayavīṇabai paligĕnugā..
priyadamu gāṁchina ānaṁdamulo.. manase... vasaṁta ṛtuvāyĕnugā!

kālaṁ kāni kālaṁlo.. koyila kūdalaṁdugane
taruṇaṁ kāni taruṇaṁlo.. nī madi.. ā gubulaṁdugane..
kālaṁ kāni kālaṁlo.. koyila kūdalaṁdugane

saraṇaṁ 2:

taḽugubĕḽuguḽa tārāmaṇulado.. śhāradarātrulu rāledu
āgāśhaṁlo pagabagalāḍusu.. rāgāsaṁdruḍā... rāne ledu!

kālaṁ kāni kālaṁlo.. sallani vĕnnĕla yĕṁdugano..
taruṇaṁ kāni taruṇaṁlo.. nā madi.. ī gubulĕṁdugano..
kālaṁ kāni kālaṁlo.. sallani vĕnnĕla yĕṁdugano

saraṇaṁ 3:

talasina talabulu phaliṁchagalavani.. bulabāḍamu balamāyĕnugā..
pagaḍi kalaluganu kanyāmaṇulagu.. priyuḍe... rāgāsaṁdruḍugā!

kālaṁ kāni kālaṁlo.. sallani vĕnnĕla aṁdugane..
taruṇaṁ kāni taruṇaṁlo.. nī madi.. ā gubulaṁdugane..
kālaṁ kāni kālaṁlo.. sallani vĕnnĕla aṁdugane