Kaadarabudaana nenu ghanumdu taanu

కాతరపుదాన నేను ఘనుఁడు తాను
Language

(॥పల్లవి॥)
కాతరపుదాన నేను ఘనుఁడు తాను
ఘాతలు నింత కోపితే కరుణిచుమనవే

(॥కాత॥)
కొప్పువట్టి తియ్యరాదు కొనగోర నూఁదరాదు
చెప్పి తన పొందు లెట్టు సేయుమనీనే
ముప్పిఁ దిట్టఁగరాదు మోవి గంటిసేయరాదు
అప్పటి సరసమెట్లాడు మనీనే

(॥కాత॥)
తమ్ములను వెట్టరాదు తతిఁగాలు వేయరాదు
నమ్మించి తనతో నెట్టు నవ్వుమనీనే
కిమ్ముల రా కొట్టరాదు కిందు పరచఁగరాదు
కమ్మటి తన మేనెట్లు కాఁగిలించుమనీనే

(॥కాత॥)
చేముట్టి చెనకరాదు చేరి పనిగొనరాదు
ఆముకొని యెట్టు పెండ్లాడుమనీనే
యీమేర శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
కామించి తనకు నెట్టు కత చెప్పుమనీనే

(||pallavi||)
kādarabudāna nenu ghanum̐ḍu tānu
ghādalu niṁta kobide karuṇisumanave

(||kāda||)
kŏppuvaṭṭi tiyyarādu kŏnagora nūm̐darādu
sĕppi tana pŏṁdu lĕṭṭu seyumanīne
muppim̐ diṭṭam̐garādu movi gaṁṭiseyarādu
appaḍi sarasamĕṭlāḍu manīne

(||kāda||)
tammulanu vĕṭṭarādu tadim̐gālu veyarādu
nammiṁchi tanado nĕṭṭu navvumanīne
kimmula rā kŏṭṭarādu kiṁdu parasam̐garādu
kammaḍi tana menĕṭlu kām̐giliṁchumanīne

(||kāda||)
semuṭṭi sĕnagarādu seri panigŏnarādu
āmugŏni yĕṭṭu pĕṁḍlāḍumanīne
yīmera śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nelĕ
kāmiṁchi tanagu nĕṭṭu kada sĕppumanīne