Kaadaraana mohimchi kaasugumdaana neevela

కాతరాన మోహించి కాచుకుందాన నీవేళ
Language

(॥పల్లవి॥)
కాతరాన మోహించి కాచుకుందాన నీవేళ
చేతికి నీవు వరమిచ్చేదెపుడో కాని

(॥కాత॥)
పొలపచూపులఁజూచి బొమ్మలను జంకించి
చలిమీ బలిమీని సాదించితి
వలపుతేటలు చల్లి వాదించితిని నీతో
కెలన నీమతి గరఁగేదెన్నఁడోకాని

(॥కాత॥)
చెనకి చేఁతలేసేసి సిగ్గులు సోఁకించితి
ననుపు గావలెనని నవ్వు నవ్వితి
మొనవాఁడి గోరితోనే మొక్కులెల్లా మొక్కితిని
యెనసి నీవు లోనయ్యే దెట్లానోకాని

(॥కాత॥)
తగులాయములు చెప్పి తమకము గడునించి
తగవులెల్లా నెరపి దైవారితి
మగువనని దయతో మన్నించి కూడితి విట్టె
నిగిడి శ్రీ వేంకటేశ నేర్పుయేదోకాని

(||pallavi||)
kādarāna mohiṁchi kāsuguṁdāna nīveḽa
sedigi nīvu varamichchedĕbuḍo kāni

(||kāda||)
pŏlabasūbulam̐jūsi bŏmmalanu jaṁkiṁchi
salimī balimīni sādiṁchidi
valabudeḍalu salli vādiṁchidini nīdo
kĕlana nīmadi garam̐gedĕnnam̐ḍogāni

(||kāda||)
sĕnagi sem̐talesesi siggulu som̐kiṁchidi
nanubu gāvalĕnani navvu navvidi
mŏnavām̐ḍi goridone mŏkkulĕllā mŏkkidini
yĕnasi nīvu lonayye dĕṭlānogāni

(||kāda||)
tagulāyamulu sĕppi tamagamu gaḍuniṁchi
tagavulĕllā nĕrabi daivāridi
maguvanani dayado manniṁchi kūḍidi viṭṭĕ
nigiḍi śhrī veṁkaḍeśha nerbuyedogāni