Kaadaninamdugu neevu galidem jaalu

కాదనినందుకు నీవు గలితేఁ జాలు
Language

(॥పల్లవి॥)
కాదనినందుకు నీవు గలితేఁ జాలు
నీదాననైతిఁ గాక నించనోప నిఁకను

(॥కాద॥)
చక్కని నీ వదనమే చంద్రోదయము నాకు
చుక్కలేని మోవి మీఁది సూదివాట్లు
వెక్కనపు నీ నవ్వు వెన్నెలపులుఁగములు
వొక్కటైతి నలుగ నేనోప నీతో నిఁకను

(॥కాద॥)
నీ మేనిచెమటలు నిండినట్టిమంచు నాకు
అమనివూరుపులే పయ్యరరగాలి
కోమలపుఁబులకలె కూరిమి గుజ్జనఁగూళ్శు
యేమిగల్లా నియ్యకొంటి నెదురాడనోపను

(॥కాద॥)
కాఁగిననీరతిపొందే కందువరాతిరి నాకు
మూఁగిన పరవశాలే ముంపునిద్దుర
వీఁగక శ్రీ వేంకటేశ వేడుక నీసరసమే
పాఁగినట్టితలఁబాలు పదరకు మికను

(||pallavi||)
kādaninaṁdugu nīvu galidem̐ jālu
nīdānanaidim̐ gāga niṁchanoba nim̐kanu

(||kāda||)
sakkani nī vadaname saṁdrodayamu nāgu
sukkaleni movi mīm̐di sūdivāṭlu
vĕkkanabu nī navvu vĕnnĕlabulum̐gamulu
vŏkkaḍaidi naluga nenoba nīdo nim̐kanu

(||kāda||)
nī menisĕmaḍalu niṁḍinaṭṭimaṁchu nāgu
amanivūrubule payyararagāli
komalabum̐bulagalĕ kūrimi gujjanam̐gūḽśhu
yemigallā niyyagŏṁṭi nĕdurāḍanobanu

(||kāda||)
kām̐ginanīradibŏṁde kaṁduvarādiri nāgu
mūm̐gina paravaśhāle muṁpuniddura
vīm̐gaga śhrī veṁkaḍeśha veḍuga nīsarasame
pām̐ginaṭṭidalam̐bālu padaragu miganu