కాదని వేసరేవా కరుణించినవాఁడవు
(॥పల్లవి॥)
కాదని వేసరేవా కరుణించినవాఁడవు
పాదుకొని వొద్దనే పాయకుందువు గాక
(॥కాద॥)
నన్ను నింతగా నేలి నమ్మించినవాఁడవు
విన్నపము సేయనేల వేమారు నీకు
సన్నలాచాయలా నాచనవులు చెల్లించి
మన్నించి నీవే యెరిఁగి మనిసేవుగాక
(॥కాద॥)
అట్టె నాచే సేవగొని ఆదరించినవాండవు
దిట్టనై నాగుణములు తెలుపనేల
నెట్టన నీమహిములు నీవే తలఁచుకొని
రట్టుగా నను రక్షించే విట్టె నీవేకాక
(॥కాద॥)
పొత్తున నన్నుఁ బెట్టుక భోగించినవాఁడవు
బత్తి నీకుఁ జేసిచూపఁగనేల
హత్తి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
సత్తుగాఁ గూడితివి మెచ్చఁగఁదగుఁగాక
(||pallavi||)
kādani vesarevā karuṇiṁchinavām̐ḍavu
pādugŏni vŏddane pāyaguṁduvu gāga
(||kāda||)
nannu niṁtagā neli nammiṁchinavām̐ḍavu
vinnabamu seyanela vemāru nīgu
sannalāsāyalā nāsanavulu sĕlliṁchi
manniṁchi nīve yĕrim̐gi manisevugāga
(||kāda||)
aṭṭĕ nāse sevagŏni ādariṁchinavāṁḍavu
diṭṭanai nāguṇamulu tĕlubanela
nĕṭṭana nīmahimulu nīve talam̐sugŏni
raṭṭugā nanu rakṣhiṁche viṭṭĕ nīvegāga
(||kāda||)
pŏttuna nannum̐ bĕṭṭuga bhogiṁchinavām̐ḍavu
batti nīgum̐ jesisūbam̐ganela
hatti śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
sattugām̐ gūḍidivi mĕchcham̐gam̐dagum̐gāga