Kaadani tolamgaraadu kaigoni melamgaraadu

కాదని తొలఁగరాదు కైకొని మెలఁగరాదు
Language

(॥పల్లవి॥)
కాదని తొలఁగరాదు కైకొని మెలఁగరాదు
వీదరవెల్లి పొందులు విందులై వుండును

(॥కాద॥)
వలపుఁదేనెలమోవి వంచి నీవు మాటాడితే
తెలిసినవారికెల్లా తియ్యనుండును
కలసేటి నీ కాఁగిటి కాంతలకుఁ జూచితేను
యెలమిఁ బదారువేల యెంగిలై వుండును

(॥కాద॥)
చల్లనిమేనితో నీవు సారెఁ గాఁగిలించుకొంటే
యెల్లవారికినిఁ జూడ ఇంపై వుండును
పొల్లుగానినీ సతులు భోగించదొరకొంటే
గొల్లెతల మానముల గురుతులై వుండును

(॥కాద॥)
సింగారపుఁ గొనగోళ్లచేయి నీవు వేసితేను
అంగజముద్రలు వేవేలై వుండును
ఇంగితపు శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
సంగతి నీవే నాకు సమ్మతులై వుండును

(||pallavi||)
kādani tŏlam̐garādu kaigŏni mĕlam̐garādu
vīdaravĕlli pŏṁdulu viṁdulai vuṁḍunu

(||kāda||)
valabum̐denĕlamovi vaṁchi nīvu māḍāḍide
tĕlisinavārigĕllā tiyyanuṁḍunu
kalaseḍi nī kām̐giḍi kāṁtalagum̐ jūsidenu
yĕlamim̐ badāruvela yĕṁgilai vuṁḍunu

(||kāda||)
sallanimenido nīvu sārĕm̐ gām̐giliṁchugŏṁṭe
yĕllavāriginim̐ jūḍa iṁpai vuṁḍunu
pŏllugāninī sadulu bhogiṁchadŏragŏṁṭe
gŏllĕdala mānamula gurudulai vuṁḍunu

(||kāda||)
siṁgārabum̐ gŏnagoḽlaseyi nīvu vesidenu
aṁgajamudralu vevelai vuṁḍunu
iṁgidabu śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
saṁgadi nīve nāgu sammadulai vuṁḍunu