Kaadanevaarevvaru kadumjali vaase neegu

కాదనేవారెవ్వరు కడుఁజలి వాసె నీకు
Language

(॥పల్లవి॥)
కాదనేవారెవ్వరు కడుఁజలి వాసె నీకు
యీ దెస ముందువెనక లెంచనేల ఇఁకను

(॥కాద॥)
పొందు నీకుఁ గలిగితే పోఁదోయవచ్చునా
అందుకోవయ్యా విడె మాపెచేతను
కందువ నాపెతో పొత్తుగలసినవాఁడవు
నిందలకు వెఱవఁగ నీకేల ఇఁకను

(॥కాద॥)
వొడఁబాటు గలిగితే వోపననవచ్చునా
కడఁగి యాపెతోఁ బెనఁగకువయ్యా
వొడిగట్టుకొని యాపె నొద్దఁబెట్టుకున్నాఁడవు
వెడ విచారాలు సేయ వేరేయేల ఇఁకను

(॥కాద॥)
వావి నీకుఁ గలిగితే వలదనవచ్చునా
వేవేగఁ బెండ్లాడి నీవు వెలయవయ్యా
యీవల శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
కైవసమయినమీఁద కడమేల యిఁకను

(||pallavi||)
kādanevārĕvvaru kaḍum̐jali vāsĕ nīgu
yī dĕsa muṁduvĕnaga lĕṁchanela im̐kanu

(||kāda||)
pŏṁdu nīgum̐ galigide pom̐doyavachchunā
aṁdugovayyā viḍĕ mābĕsedanu
kaṁduva nābĕdo pŏttugalasinavām̐ḍavu
niṁdalagu vĕṟavam̐ga nīgela im̐kanu

(||kāda||)
vŏḍam̐bāḍu galigide vobananavachchunā
kaḍam̐gi yābĕdom̐ bĕnam̐gaguvayyā
vŏḍigaṭṭugŏni yābĕ nŏddam̐bĕṭṭugunnām̐ḍavu
vĕḍa visārālu seya vereyela im̐kanu

(||kāda||)
vāvi nīgum̐ galigide valadanavachchunā
vevegam̐ bĕṁḍlāḍi nīvu vĕlayavayyā
yīvala śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
kaivasamayinamīm̐da kaḍamela yim̐kanu