Kaadanemaa nee vaabem gaamgilimchugonamgaanu

కాదనేమా నీ వాపెఁ గాఁగిలించుకొనఁగాను
Language

(॥పల్లవి॥)
కాదనేమా నీ వాపెఁ గాఁగిలించుకొనఁగాను
యీదెస మమ్మింత భ్రమఇంచకువయ్యా

(॥కాద॥)
అట్టె ఆపెకుఁ జుట్టమవైతే నౌదుగాక మమ్ము
వట్టిపరాకులు సేయవలదయ్యా
చుట్టి మాటలాడ సందుచూచుకొంటేఁ గొందుగాక
దిట్టవై విడెము మమ్ముఁ దేనంపకువయ్యా

(॥కాద॥)
చొప్పుగా నీవాపెదిక్కు చూచితే చూతువుగాక
కప్పురము మాకన్నుల గుప్పకువయ్యా
చిప్పిల బొంద ననుపుసేసుకొంటేఁ గొందువుగాక
విప్పుచుఁ బచ్చడము పైఁగప్పకువయ్యా

(॥కాద॥)
పిలిచి యాపెకు సొమ్ము పెట్టితేఁ బెట్టుదుగాక
వెలచెప్పి పందేలు వేయకువయ్యా
చెలి యలమేలుమంగ శ్రీవేంకటేశుఁడవు
ఇల మమ్ము నేలితి వెంతవాఁడవయ్యా

(||pallavi||)
kādanemā nī vābĕm̐ gām̐giliṁchugŏnam̐gānu
yīdĕsa mammiṁta bhrama̮iṁchaguvayyā

(||kāda||)
aṭṭĕ ābĕgum̐ juṭṭamavaide naudugāga mammu
vaṭṭibarāgulu seyavaladayyā
suṭṭi māḍalāḍa saṁdusūsugŏṁṭem̐ gŏṁdugāga
diṭṭavai viḍĕmu mammum̐ denaṁpaguvayyā

(||kāda||)
sŏppugā nīvābĕdikku sūside sūduvugāga
kappuramu māgannula guppaguvayyā
sippila bŏṁda nanubusesugŏṁṭem̐ gŏṁduvugāga
vippusum̐ bachchaḍamu paim̐gappaguvayyā

(||kāda||)
pilisi yābĕgu sŏmmu pĕṭṭidem̐ bĕṭṭudugāga
vĕlasĕppi paṁdelu veyaguvayyā
sĕli yalamelumaṁga śhrīveṁkaḍeśhum̐ḍavu
ila mammu nelidi vĕṁtavām̐ḍavayyā