(॥పల్లవి॥)
కాదనఁగఁ దగదు కాంతునికి
మోదపు సతులకు మోహములే
(॥కాద॥)
పలుమరు సొలసిన పైపైఁ గొసరిన
చెలులకు నవి యొచ్చము గావు
పలుకుల దూరిన పంతము లాడిన
చలములు గా వవి సహజములే
(॥కాద॥)
చనవున నొరసిన సన్నలఁ దిట్టిన
వనితల కవి కొదవలు గావు
చెనకుచుఁ గసరిన చేతులు చాఁచిన
పెనఁగుటలు గావు ప్రేమములే
(॥కాద॥)
పగటులు చూపిన పాదము దొక్కిన
మగువలు కవి కడమలు గావు
తగిలె శ్రీవేంకటోత్తమ నిను మా యింతి
వెగటులు గా వివి వేడుకలే
(||pallavi||)
kādanam̐gam̐ dagadu kāṁtunigi
modabu sadulagu mohamule
(||kāda||)
palumaru sŏlasina paibaim̐ gŏsarina
sĕlulagu navi yŏchchamu gāvu
palugula dūrina paṁtamu lāḍina
salamulu gā vavi sahajamule
(||kāda||)
sanavuna nŏrasina sannalam̐ diṭṭina
vanidala kavi kŏdavalu gāvu
sĕnagusum̐ gasarina sedulu sām̐sina
pĕnam̐guḍalu gāvu premamule
(||kāda||)
pagaḍulu sūbina pādamu dŏkkina
maguvalu kavi kaḍamalu gāvu
tagilĕ śhrīveṁkaḍottama ninu mā yiṁti
vĕgaḍulu gā vivi veḍugale