కాదందునో అవునందునో గరిమలు నీవి చూచి
(॥పల్లవి॥)
కాదందునో అవునందునో గరిమలు నీవి చూచి
సోదించి తెలుసుకొని చొక్కితి నిట్టె నేను
(॥కాదం॥)
నగితే నీ సెలవుల నయమై వెన్నెల గాసీ
మొగము చూచితేను ముద్దు గారీని
యెగసక్కేలాడేనంటే యెట్టు మనసు గొలుపు
పగటు నీ చేఁతలకు బ్రమసితి నేను
(॥కాదం॥)
మాఁటలాడి చూచితేను మంచితనాలే వూరీ
వాఁటపు నీ చూపులను వలపే నిండీ
ఆఁ టదాన జంకించ నందుకెట్టు వొడఁబడే
కూటువ నీ మన్ననల గురుతైతి నేను
(॥కాదం॥)
సారెఁ గాఁగిలించుకొంటే సంతోసములే మించీ
కూరిమి నీవు గూడిన కూటమే చెప్పీ
యీరీతి శ్రీ వేంకటేశ యేమని పొగడవచ్చు
తారుకాణ నీరతులఁ దనిసితి నేను
(||pallavi||)
kādaṁduno avunaṁduno garimalu nīvi sūsi
sodiṁchi tĕlusugŏni sŏkkidi niṭṭĕ nenu
(||kādaṁ||)
nagide nī sĕlavula nayamai vĕnnĕla gāsī
mŏgamu sūsidenu muddu gārīni
yĕgasakkelāḍenaṁṭe yĕṭṭu manasu gŏlubu
pagaḍu nī sem̐talagu bramasidi nenu
(||kādaṁ||)
mām̐ṭalāḍi sūsidenu maṁchidanāle vūrī
vām̐ṭabu nī sūbulanu valabe niṁḍī
ām̐ ṭadāna jaṁkiṁcha naṁdugĕṭṭu vŏḍam̐baḍe
kūḍuva nī mannanala gurudaidi nenu
(||kādaṁ||)
sārĕm̐ gām̐giliṁchugŏṁṭe saṁtosamule miṁchī
kūrimi nīvu gūḍina kūḍame sĕppī
yīrīdi śhrī veṁkaḍeśha yemani pŏgaḍavachchu
tārugāṇa nīradulam̐ danisidi nenu