జెప్పఁ జెప్పఁ గొత్తలాయ చేరి వినేవారికెల్లా
(॥పల్లవి॥)
జెప్పఁ జెప్పఁ గొత్తలాయ చేరి వినేవారికెల్లా
కుప్పలుఁ దెప్పలుఁ గాఁగ కొమ్మలాల వినరే
(॥సరి॥)
ఆయాలంటి ఆయాలంటి యప్పటి వేఁడుకోఁగాను
కాయజ కేలికి నీకెఁ గరుణించవయ్యా
(॥సరి॥)
సన్నసేసి సన్నసేసి నారె నిన్నుఁ బిలువఁగా
యెన్నఁడు మన్నించేవు యేమయ్యా
చన్ను లొత్తి చన్ను లొత్ సాముల నీతోఁ జేయఁగా
చెన్నుగా నీకె చనవు చెల్లించఁదగదా
(॥సరి॥)
సేవసేసి సేవసేసి చేతులెత్తి మొక్కఁగాను
యేవేళఁ జిత్తగించేవు యేమయ్యా
వేవేలు చందాలను శ్రీవేంకటేశ కూడితివి
యీవిధాన నేలియీకె నింత సేయఁదగదా
(||pallavi||)
jĕppam̐ jĕppam̐ gŏttalāya seri vinevārigĕllā
kuppalum̐ dĕppalum̐ gām̐ga kŏmmalāla vinare
(||sari||)
āyālaṁṭi āyālaṁṭi yappaḍi vem̐ḍugom̐gānu
kāyaja keligi nīgĕm̐ garuṇiṁchavayyā
(||sari||)
sannasesi sannasesi nārĕ ninnum̐ biluvam̐gā
yĕnnam̐ḍu manniṁchevu yemayyā
sannu lŏtti sannu lŏt sāmula nīdom̐ jeyam̐gā
sĕnnugā nīgĕ sanavu sĕlliṁcham̐dagadā
(||sari||)
sevasesi sevasesi sedulĕtti mŏkkam̐gānu
yeveḽam̐ jittagiṁchevu yemayyā
vevelu saṁdālanu śhrīveṁkaḍeśha kūḍidivi
yīvidhāna neliyīgĕ niṁta seyam̐dagadā