Jeeradeesenaa neebai naasittamemi yarasevu

జీరదీసేనా నీపై నాచిత్తమేమి యరసేవు
Language

(॥పల్లవి॥)
జీరదీసేనా నీపై నాచిత్తమేమి యరసేవు
చేరి నీ చెప్పినట్టెల్లా సేవసేతుఁగాక

(॥జీర॥)
కన్నుల జంకించితేను కాదనేనా నిన్ను
సన్నల నీవు దిట్టితే సాదించేనా
చన్నులు విసికితేను చలపట్టిపెనఁగేనా
అన్నిటా నీచేతఁకు లోనైవుండుదుఁగాక

(॥జీర॥)
కొప్పువట్టి తీసితేను కోపగించేనా నిన్ను
చిప్పిలఁ జెనకితేను చేయివట్టేనా
ముప్పిరి గోరనూఁదితే తప్పించుకోఁజూచేనా
యెప్పుడూ నీకిచ్చకమై యెనయుదుఁగాక

(॥జీర॥)
బలిమి నీవు పైకొంటే పంతములాడేనా
వల పెంతరేఁచినాను వలదనేనా
యెలమి శ్రీవేంకటేశ యింతో నన్నేలితివి
తొలుతటివలెనే సంతోసింతుఁగాక

(||pallavi||)
jīradīsenā nībai nāsittamemi yarasevu
seri nī sĕppinaṭṭĕllā sevasedum̐gāga

(||jīra||)
kannula jaṁkiṁchidenu kādanenā ninnu
sannala nīvu diṭṭide sādiṁchenā
sannulu visigidenu salabaṭṭibĕnam̐genā
anniḍā nīsedam̐ku lonaivuṁḍudum̐gāga

(||jīra||)
kŏppuvaṭṭi tīsidenu kobagiṁchenā ninnu
sippilam̐ jĕnagidenu seyivaṭṭenā
muppiri goranūm̐dide tappiṁchugom̐jūsenā
yĕppuḍū nīgichchagamai yĕnayudum̐gāga

(||jīra||)
balimi nīvu paigŏṁṭe paṁtamulāḍenā
vala pĕṁtarem̐sinānu valadanenā
yĕlami śhrīveṁkaḍeśha yiṁto nannelidivi
tŏludaḍivalĕne saṁtosiṁtum̐gāga