Javvanavanamula samdadim benagoni

జవ్వనవనముల సందడిఁ బెనగొని
Language

(॥పల్లవి॥)
జవ్వనవనముల సందడిఁ బెనగొని
దవ్వుగఁ జూడక తగులవయ్యా

(॥జవ్వ॥)
చెక్కిటి చేతనే చింతలచిగు రమ్మీ
పోక్కుచు నీయెదుట బొయతి
ముక్కుపైవేలనే మోవిపండ్లమ్మీ
అక్కరతో నీ వడుగవయ్యా

(॥జవ్వ॥)
కాయవుఁగాఁకలఁ గలగూరమ్మీ
పోయినఁ బోకిటు బోయతి
పాయపు వెరగుల పచ్చిగొంటు లమ్మీ
చేయారఁగ వెల సేయవయ్యా

(॥జవ్వ॥)
కసరుల నానాగరబులు నమ్మీ
పొసఁగ నీకాఁగిట బోయతి
కసుగందనిచనుఁగవ వెలఁగలు నీ-
వసము శ్రీవేంకటేశ్వర కొనవయ్యా

(||pallavi||)
javvanavanamula saṁdaḍim̐ bĕnagŏni
davvugam̐ jūḍaga tagulavayyā

(||javva||)
sĕkkiḍi sedane siṁtalasigu rammī
pokkusu nīyĕduḍa bŏyadi
mukkubaivelane movibaṁḍlammī
akkarado nī vaḍugavayyā

(||javva||)
kāyavum̐gām̐kalam̐ galagūrammī
poyinam̐ bogiḍu boyadi
pāyabu vĕragula pachchigŏṁṭu lammī
seyāram̐ga vĕla seyavayyā

(||javva||)
kasarula nānāgarabulu nammī
pŏsam̐ga nīgām̐giḍa boyadi
kasugaṁdanisanum̐gava vĕlam̐galu nī-
vasamu śhrīveṁkaḍeśhvara kŏnavayyā