జవ్వనంబు రూపురేఖ చాలఁ గలిగినట్టి ప(ఫ)లము
(॥పల్లవి॥)
జవ్వనంబు రూపురేఖ చాలఁ గలిగినట్టి ప(ఫ)లము
పువ్వువంటి యాసతోడి పొందు కామధేనువే
(॥జవ్వ॥)
మనసుమర్మమెరిఁగితేను మాటలెల్ల సమ్మతవును
చనవు గలుగఁజేసుకొనిన సలిగెఁగలుగును
పెనఁగ నేర్పు గలిగితేను ప్రియము లంతకంత కడరు
వనితలకును మగనిమీఁది వలపు కామధేనువే
(॥జవ్వ॥)
తగ వెరింగి మెలఁగితేను తలఁపులెల్లఁ జక్కనౌను
నగుమొగంబు సేసుకొన్న నాఁటుఁ బ్రియములు
మిగులననుపు సేసుకొనిన మేలమాడఁ జవులు వుట్టు
చిగురు గలిగి కొనలు సాగు చెలిమి కామధేనువే
(॥జవ్వ॥)
ఇచ్చకములు నెరప నెరప నిన్నిటాను మేలుగలుగు
కచ్చుపెట్టి కాచుకున్నఁ గలుగు వేడ్కలు
యెచ్చరించి శ్రీ వేంకటేశుఁ డిపుడె నిన్నుఁ గూడె
మెచ్చఁజేసి కలయురతులమేలు కామధేనువే
(||pallavi||)
javvanaṁbu rūburekha sālam̐ galiginaṭṭi pa(pha)lamu
puvvuvaṁṭi yāsadoḍi pŏṁdu kāmadhenuve
(||javva||)
manasumarmamĕrim̐gidenu māḍalĕlla sammadavunu
sanavu galugam̐jesugŏnina saligĕm̐galugunu
pĕnam̐ga nerbu galigidenu priyamu laṁtagaṁta kaḍaru
vanidalagunu maganimīm̐di valabu kāmadhenuve
(||javva||)
taga vĕriṁgi mĕlam̐gidenu talam̐pulĕllam̐ jakkanaunu
nagumŏgaṁbu sesugŏnna nām̐ṭum̐ briyamulu
migulananubu sesugŏnina melamāḍam̐ javulu vuṭṭu
siguru galigi kŏnalu sāgu sĕlimi kāmadhenuve
(||javva||)
ichchagamulu nĕraba nĕraba ninniḍānu melugalugu
kachchubĕṭṭi kāsugunnam̐ galugu veḍkalu
yĕchchariṁchi śhrī veṁkaḍeśhum̐ ḍibuḍĕ ninnum̐ gūḍĕ
mĕchcham̐jesi kalayuradulamelu kāmadhenuve