జఱయుచు మీ వలపు సరిబేసులాయ నేఁడు
(॥పల్లవి॥)
జఱయుచు మీ వలపు సరిబేసులాయ నేఁడు
గుఱిగా బెఁ(బెం?)జెమటలు కురిసీ మేనులను
(॥జఱ॥)
కొంకక నీ వూఁదినట్టి కొనగోరుతాఁకులకు
జంకెన చూపులు నీపైఁ జల్లీ జెలి
కొంకపు పయ్యదకొంగు పొరలఁదీసినందుకు
మంకుల వొట్టువెట్టి మారుకొనీని
(॥జఱ॥)
సంగడిఁ జన్నులమీఁద చాచిఁన నీపాదాలకు
ముంగిటి సిగ్గులు పై పై ముంచీఁ జెలి
ముంగురులు వట్టి తీసి మోవి చవిగొన్నందుకు
కెంగేలు గీలించి గిలిగించీని
(॥జఱ॥)
శ్రీ వేంకటేశ కాఁగిట చిమ్మి రేఁగిన యందుకు
నీ వదనాన బాగలు నించీఁ జెలి
చేవమీర నింతలోనె చేరినన్ను నేలితివి
భావించి మెచ్చి మెచ్చి పంతమాడీని
(||pallavi||)
jaṟayusu mī valabu saribesulāya nem̐ḍu
guṟigā bĕm̐(bĕṁ?)jĕmaḍalu kurisī menulanu
(||jaṟa||)
kŏṁkaga nī vūm̐dinaṭṭi kŏnagorudām̐kulagu
jaṁkĕna sūbulu nībaim̐ jallī jĕli
kŏṁkabu payyadagŏṁgu pŏralam̐dīsinaṁdugu
maṁkula vŏṭṭuvĕṭṭi mārugŏnīni
(||jaṟa||)
saṁgaḍim̐ jannulamīm̐da sāsim̐na nībādālagu
muṁgiḍi siggulu pai pai muṁchīm̐ jĕli
muṁgurulu vaṭṭi tīsi movi savigŏnnaṁdugu
kĕṁgelu gīliṁchi giligiṁchīni
(||jaṟa||)
śhrī veṁkaḍeśha kām̐giḍa simmi rem̐gina yaṁdugu
nī vadanāna bāgalu niṁchīm̐ jĕli
sevamīra niṁtalonĕ serinannu nelidivi
bhāviṁchi mĕchchi mĕchchi paṁtamāḍīni