పల్లవి:
జగదభిరామా రఘుకులసోమా
శరణమునీయవయా....రామా!
కరుణను జూపవయా....
చరణం 1:
కౌశికుయాగము కాచితివయ్యా
రాతిని నాతిగ చేసితివయ్యా !!2!!
హరివిల్లు విరిచి మురిపించి సీతను
పరిణయమాడిన కళ్యాణరామా
శరణమునీయవయా....రామా!
కరుణను జూపవయా....
చరణం 2:
ఒకటే బాణం ఒకటే మాట
ఒకటే సతియని చాటితివయ్యా !!2!!
కుజనులనణచి
సుజనుల బ్రోచిన...ఆ....ఆ...!!2!!
ఆదర్శమూర్తివి నీవయ్యా
శరణమునీయవయా....రామా!
కరుణను జూపవయా....
చరణం 3:
కానలకేగి కాంతను బాసి
ఎంతో వేదన చెందితివయ్యా !!2!!
అంతేలేని వింతలెన్నో
ఎంతగ ఓర్చావు రామయ్యా....
శరణమునీయవయా....రామా!
కరుణను జూపవయా....
జయ జయరాం జానకిరాం !!2!!
పావననాం మేఘశ్యాం
జయ జయరాం జానకిరాం....ఆ....!!4!!
pallavi:
jagadabhirāmā raghugulasomā
śharaṇamunīyavayā....rāmā!
karuṇanu jūbavayā....
saraṇaṁ 1:
kauśhiguyāgamu kāsidivayyā
rādini nādiga sesidivayyā !!2!!
harivillu virisi muribiṁchi sīdanu
pariṇayamāḍina kaḽyāṇarāmā
śharaṇamunīyavayā....rāmā!
karuṇanu jūbavayā....
saraṇaṁ 2:
ŏgaḍe bāṇaṁ ŏgaḍe māḍa
ŏgaḍe sadiyani sāḍidivayyā !!2!!
kujanulanaṇasi
sujanula brosina...ā....ā...!!2!!
ādarśhamūrdivi nīvayyā
śharaṇamunīyavayā....rāmā!
karuṇanu jūbavayā....
saraṇaṁ 3:
kānalagegi kāṁtanu bāsi
ĕṁto vedana sĕṁdidivayyā !!2!!
aṁteleni viṁtalĕnno
ĕṁtaga orsāvu rāmayyā....
śharaṇamunīyavayā....rāmā!
karuṇanu jūbavayā....
jaya jayarāṁ jānagirāṁ !!2!!
pāvananāṁ meghaśhyāṁ
jaya jayarāṁ jānagirāṁ....ā....!!4!!