Jaanalainayattivaari jaada livi

జాణలైనయట్టివారి జాడ లివి
Language

(॥పల్లవి॥)
జాణలైనయట్టివారి జాడ లివి
నాణెమైన పొందు లిటు నడపఁగవలయు

(॥జాణ॥)
తగవు దప్పకుండితే తగులమి యెడయదు
తెగనాడకుండితేను తియ్యదు ప్రేమ
జగడించకుండితేను జారదు చుట్టరికము
బగివాయకుండితేను భావ మెరపు గాదు

(॥జాణ॥)
కక్కసించకుండితేను కాఁపురము లీడేరు
వెక్కసము గాకుండితే వేడుక గల్గు
మొక్కలము విడిచితే మునుకొనదు చలము
వొక్కరీతినే వుండితే వుడివోదు ననుపు

(॥జాణ॥)
పంతాలు చూపకుండితే పాదుకొను మొగమోట
మంతనము గాకుండితే మైకొన దాన
ఇంతలో శ్రీవేంకటేశ యీకె నీవుఁగూడితిరి
చెంతఁ జేచాఁచకుండితే సిగ్గులెల్లా విడవు

(||pallavi||)
jāṇalainayaṭṭivāri jāḍa livi
nāṇĕmaina pŏṁdu liḍu naḍabam̐gavalayu

(||jāṇa||)
tagavu dappaguṁḍide tagulami yĕḍayadu
tĕganāḍaguṁḍidenu tiyyadu prema
jagaḍiṁchaguṁḍidenu jāradu suṭṭarigamu
bagivāyaguṁḍidenu bhāva mĕrabu gādu

(||jāṇa||)
kakkasiṁchaguṁḍidenu kām̐puramu līḍeru
vĕkkasamu gāguṁḍide veḍuga galgu
mŏkkalamu viḍiside munugŏnadu salamu
vŏkkarīdine vuṁḍide vuḍivodu nanubu

(||jāṇa||)
paṁtālu sūbaguṁḍide pādugŏnu mŏgamoḍa
maṁtanamu gāguṁḍide maigŏna dāna
iṁtalo śhrīveṁkaḍeśha yīgĕ nīvum̐gūḍidiri
sĕṁtam̐ jesām̐saguṁḍide siggulĕllā viḍavu