Jaanagi raamula

జానకి రాముల
Year
Language

పల్లవి:

జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే
జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవీ కులుకులనే సీతాకోక చిలుకలతో
జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే

చరణం 1:

కన్నూ కన్నూ కలువగనే ప్రణయం రాగం తీసెనులే
పాదం పాదం కలుపగనే హృదయం తాళం వేసెనులే
ఒకటే మాట ఒకటే బాణం ఒక పత్నీ శ్రీరామవ్రతం
నాలో... నీలో... రాగం తీసి వలపే పలికే త్యాగయ కీర్తనలెన్నో

జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవి కులుకులే సీతాకోక చిలుకలతో
జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే

చరణం 2:

జానకి మేనూ తాకగనే ఝల్లున వీణలు పొంగినవీ
జాణకు పులకలు పూయగనే జావళి అందెలు మ్రోగినవీ
ప్రేమే సత్యం ప్రేమే నిత్యం ప్రేమేలే రామయ్య మతం
నాలో... నీలో... లాస్యాలాడి లయలే చిలికే రామదాసు కృతులెన్నో

జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవి కులుకులే సీతాకోక చిలుకలతో
జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే

pallavi:

jānagirāmula kaḽyāṇānigi jagame ūyalalūgĕnule
jānagirāmula kaḽyāṇānigi jagame ūyalalūgĕnule
sīdādevī kulugulane sīdāgoga silugalado
jānagirāmula kaḽyāṇānigi jagame ūyalalūgĕnule

saraṇaṁ 1:

kannū kannū kaluvagane praṇayaṁ rāgaṁ tīsĕnule
pādaṁ pādaṁ kalubagane hṛdayaṁ tāḽaṁ vesĕnule
ŏgaḍe māḍa ŏgaḍe bāṇaṁ ŏga patnī śhrīrāmavradaṁ
nālo... nīlo... rāgaṁ tīsi valabe palige tyāgaya kīrdanalĕnno

jānagirāmula kaḽyāṇānigi jagame ūyalalūgĕnule
sīdādevi kulugule sīdāgoga silugalado
jānagirāmula kaḽyāṇānigi jagame ūyalalūgĕnule

saraṇaṁ 2:

jānagi menū tāgagane jhalluna vīṇalu pŏṁginavī
jāṇagu pulagalu pūyagane jāvaḽi aṁdĕlu mroginavī
preme satyaṁ preme nityaṁ premele rāmayya madaṁ
nālo... nīlo... lāsyālāḍi layale silige rāmadāsu kṛtulĕnno

jānagirāmula kaḽyāṇānigi jagame ūyalalūgĕnule
sīdādevi kulugule sīdāgoga silugalado
jānagirāmula kaḽyāṇānigi jagame ūyalalūgĕnule