Jaagulela sesere sagiyalaala

జాగులేల సేసేరే సకియలాల
Language

(॥పల్లవి॥)
జాగులేల సేసేరే సకియలాల
వేగమె యెచ్చరించరే వేడుక వుట్టుఁ గాని

(॥జాగు॥)
వెలఁది చెప్పినమాటఁ విన్నవించరే పతికి
చెలులాల విని సంతోసించుఁగాని
మలసి యీజవరాలిమారు సాగిలి మొక్కరే
తిలకించి తానందుకు దీవించుఁగాని

(॥జాగు॥)
కమ్మటి దేవులంపిన కానుక లొసఁగరే
కిమ్ముల నాపని చిత్తగించుఁగాని
రమ్మని పిలిచి యాపెరతికి విందు చెప్పరే
వుమ్మడిఁ జుట్టరికమై వొనగూడుఁ గాని

(॥జాగు॥)
తెరలోఁ బెండ్లి కూఁతురు దిక్కు చక్కఁ జూపరే
సరసాలాపాలు జరుపుఁగాని
ఇరవై శ్రీవేంకటేశుఁ డింతలోఁ దానెకూడె
గరిమలఁ బొగడరే కరుణించుఁగాని

(||pallavi||)
jāgulela sesere sagiyalāla
vegamĕ yĕchchariṁchare veḍuga vuṭṭum̐ gāni

(||jāgu||)
vĕlam̐di sĕppinamāḍam̐ vinnaviṁchare padigi
sĕlulāla vini saṁtosiṁchum̐gāni
malasi yījavarālimāru sāgili mŏkkare
tilagiṁchi tānaṁdugu dīviṁchum̐gāni

(||jāgu||)
kammaḍi devulaṁpina kānuga lŏsam̐gare
kimmula nābani sittagiṁchum̐gāni
rammani pilisi yābĕradigi viṁdu sĕppare
vummaḍim̐ juṭṭarigamai vŏnagūḍum̐ gāni

(||jāgu||)
tĕralom̐ bĕṁḍli kūm̐turu dikku sakkam̐ jūbare
sarasālābālu jarubum̐gāni
iravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalom̐ dānĕgūḍĕ
garimalam̐ bŏgaḍare karuṇiṁchum̐gāni