Jaabiligi vennelagi puttina punnami

జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమి
Work
Year
Language

పల్లవి:

జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరోవే చంటి పాడే జోలలోనే
జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

చరణం 1:

కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకీ
అమ్మ ముద్దు కన్న వేరే ముద్ద లేదు ఆకలికీ
కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకీ
అమ్మ ముద్దు కన్న వేరే ముద్ద లేదు ఆకలికీ
దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి
చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి
అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనా
బువ్వ పెట్టి బుజ్జగించే లాలనెంతో తియ్యన
మంచు కన్నా చల్లనైనా మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా

pallavi:

jābiligi vĕnnĕlagi puṭṭina punnamile
gaṁgalalo tenĕlalo kaḍigina mutyamule
muddulone pŏdduboye kaṁṭi niṁḍā nidarove saṁṭi pāḍe jolalone
jābiligi vĕnnĕlagi puṭṭina punnamile
gaṁgalalo tenĕlalo kaḍigina mutyamule

saraṇaṁ 1:

kannadalli prema kannā annamedi pābalagī
amma muddu kanna vere mudda ledu āgaligī
kannadalli prema kannā annamedi pābalagī
amma muddu kanna vere mudda ledu āgaligī
devadaṁṭi amma nīḍe kovĕle biḍḍalagi
sĕmmagillu biḍḍa kanne eḍube ammalagi
amma sedi kammanaina dĕbba kūḍā dīvĕnā
buvva pĕṭṭi bujjagiṁche lālanĕṁto tiyyana
maṁchu kannā sallanainā mallĕ kannā tĕllanaina amma pāḍe pāḍugonā
mallĕ kannā tĕllanaina amma pāḍe pāḍugonā
mallĕ kannā tĕllanaina amma pāḍe pāḍugonā