Iyyagomti raavayyaa yeedagu neevu

ఇయ్యకొంటి రావయ్యా యీడకు నీవు
Language

(॥పల్లవి॥)
ఇయ్యకొంటి రావయ్యా యీడకు నీవు
పయ్యదలో చన్నులాంటి బాససేయ నేఁటికి

(॥ఇయ్య॥)
వనితలెందరు నీపై వలపులు చల్లినాను
మనసుగలచోఁ గాక మాటలాడేవా
వినయ మప్పటి నీకు వేమారుఁ జేసినాను
ననుపైనచోటఁగాక నవ్వు నవ్వేవా

(॥ఇయ్య॥)
నియతాన మరెందరు నిన్నుఁ బెండ్లాడినాను
దయగలచోటఁ గాక తమకించేవా
రయమునఁ దాము నిన్ను రతి కెంత దీసినాను
ప్రియము గలచోఁగాక బెరసి కూడేవా

(॥ఇయ్య॥)
నిగిడి ఇందరు నిట్టె నిన్నుఁ గాఁగిలించుకొన్నా
తగులు గలచోఁగాక తనివందేవా
జిగి నన్నుఁగూడితివి శ్రీ వేంకటేశ్వరుఁడవు
సొగసిన చోటఁగాక సొంపు నెరపేవా

(||pallavi||)
iyyagŏṁṭi rāvayyā yīḍagu nīvu
payyadalo sannulāṁṭi bāsaseya nem̐ṭigi

(||iyya||)
vanidalĕṁdaru nībai valabulu sallinānu
manasugalasom̐ gāga māḍalāḍevā
vinaya mappaḍi nīgu vemārum̐ jesinānu
nanubainasoḍam̐gāga navvu navvevā

(||iyya||)
niyadāna marĕṁdaru ninnum̐ bĕṁḍlāḍinānu
dayagalasoḍam̐ gāga tamagiṁchevā
rayamunam̐ dāmu ninnu radi kĕṁta dīsinānu
priyamu galasom̐gāga bĕrasi kūḍevā

(||iyya||)
nigiḍi iṁdaru niṭṭĕ ninnum̐ gām̐giliṁchugŏnnā
tagulu galasom̐gāga tanivaṁdevā
jigi nannum̐gūḍidivi śhrī veṁkaḍeśhvarum̐ḍavu
sŏgasina soḍam̐gāga sŏṁpu nĕrabevā