Ivivo nee kaamta suddu lemani seppemimka

ఇవివో నీ కాంత సుద్దు లేమని చెప్పేమిఁక
Language

(॥పల్లవి॥)
ఇవివో నీ కాంత సుద్దు లేమని చెప్పేమిఁక
జవళి నీవూఁ గూడితే సంతోసాలయ్యీని

(॥ఇవి॥)
వుడివోనితమితోడ నుమ్మగిలీ జవరాలు
వొడలి చెమటలతో నోలలాడీని
చిడుముడి కోరికల చిత్తమెల్లాఁ జంచలించి
అడరి నిట్టూర్పుల నుయ్యాల లూఁగీని

(॥ఇవి॥)
విరహపు వేదనల వీడు దోడాడుకొంటాను
సరి నెదురుచూపుల జాజరాడీని
మరగిన మమతలు మక్కళించి మక్కళించి
తురుము వీడి చీఁకటిఁ దులఁదూఁగీని

(॥ఇవి॥)
చెలులతో నీ సుద్దులు చెప్పి చెప్పి పులకల
వలపుల రతులకు వంతులాడీని
యెలమి శ్రీవేంకటేశ యింతలో నిన్నుఁ బెండ్లాడి
మొలక నవ్వు లెల్లాను ముప్పిరి వేసీని

(||pallavi||)
ivivo nī kāṁta suddu lemani sĕppemim̐ka
javaḽi nīvūm̐ gūḍide saṁtosālayyīni

(||ivi||)
vuḍivonidamidoḍa nummagilī javarālu
vŏḍali sĕmaḍalado nolalāḍīni
siḍumuḍi korigala sittamĕllām̐ jaṁchaliṁchi
aḍari niṭṭūrbula nuyyāla lūm̐gīni

(||ivi||)
virahabu vedanala vīḍu doḍāḍugŏṁṭānu
sari nĕdurusūbula jājarāḍīni
maragina mamadalu makkaḽiṁchi makkaḽiṁchi
turumu vīḍi sīm̐kaḍim̐ dulam̐dūm̐gīni

(||ivi||)
sĕlulado nī suddulu sĕppi sĕppi pulagala
valabula radulagu vaṁtulāḍīni
yĕlami śhrīveṁkaḍeśha yiṁtalo ninnum̐ bĕṁḍlāḍi
mŏlaga navvu lĕllānu muppiri vesīni