ఇవిఁ గొన్ని వట్టి ప్రియాలేల సేసీనే
(॥పల్లవి॥)
ఇవిఁ గొన్ని వట్టి ప్రియాలేల సేసీనే
తవిలి నా కాఁగిటను తనివొందుఁగాక
(॥ఇవిఁ॥)
యింత నాపై బత్తి గల్తే నెడమాఁట లేఁటికే
మంతనాన తానే వచ్చి మాఁటాడుఁగాక
వింతలేక మెలఁగితే వెడసన్న లేఁటికే
సంతోసాన నందరిలో చనవిచ్చుఁగాక
(॥ఇవిఁ॥)
మనసు నాపైఁ బారితే మళ్లి మళ్లి చూడనేలే
ననిచి వద్ద గూచుండి నవ్వుఁగాక
తనకే నే బాఁతైతే తలపోఁత లేఁటికే
చెనకి నారతులకుఁ జిత్తగించుఁగాక
(॥ఇవిఁ॥)
దేవులఁ గావలసితే దెరమరగేఁటికే
మోవితేనెపొత్తులకు మొనయుఁగాక
శ్రీ వేంకటేశుఁడు చేరి తానే నన్నుఁ గూడె
పూవుల వేయ నేఁటికే పొందివుండుఁ గాక
(||pallavi||)
ivim̐ gŏnni vaṭṭi priyālela sesīne
tavili nā kām̐giḍanu tanivŏṁdum̐gāga
(||ivim̐||)
yiṁta nābai batti galde nĕḍamām̐ṭa lem̐ṭige
maṁtanāna tāne vachchi mām̐ṭāḍum̐gāga
viṁtalega mĕlam̐gide vĕḍasanna lem̐ṭige
saṁtosāna naṁdarilo sanavichchum̐gāga
(||ivim̐||)
manasu nābaim̐ bāride maḽli maḽli sūḍanele
nanisi vadda gūsuṁḍi navvum̐gāga
tanage ne bām̐taide talabom̐ta lem̐ṭige
sĕnagi nāradulagum̐ jittagiṁchum̐gāga
(||ivim̐||)
devulam̐ gāvalaside dĕramaragem̐ṭige
movidenĕbŏttulagu mŏnayum̐gāga
śhrī veṁkaḍeśhum̐ḍu seri tāne nannum̐ gūḍĕ
pūvula veya nem̐ṭige pŏṁdivuṁḍum̐ gāga