Iveem gonni nerisidi visumamta padusavu

ఇవీఁ గొన్ని నేరిచితి విసుమంత పడుచవు
Language

(॥పల్లవి॥)
ఇవీఁ గొన్ని నేరిచితి విసుమంత పడుచవు
జవరాలనైతివి సాదించనోపుదువే

(॥ఇవిఁ॥)
సెలవుల నవ్వుకొంటా సిగ్గులుపడుకొంటాను
తలకొని పతికెంత తమిరెఁచేవే
కలువల వేసుకొంటా కడుసన్న సూసుకొంటా
వలపులు చల్లిచల్లి వలలంబెట్టేవే

(॥ఇవిఁ॥)
కన్నులారుచుకొంటాను కతలు చెప్పుకొంటాను
పన్నుకయాతని నెంతభ్రమయించేవే
చన్నులు చూపుకొంటాను సంగడిఁ గూచుండుకొంటా
తిన్ననిచేఁతల నెట్లు తేలించేవే

(॥ఇవిఁ॥)
సరసములాడుకొంటా చవులుచూపుకొంటాను
పెరరేఁపుల నెందాఁకా బెల్లించేవే
అరిది శ్రీవేంకటేశుఁడల మేలుమంగపతి
యిరవై నన్నేలె నిఁక నేమిసొలసేవే

(||pallavi||)
ivīm̐ gŏnni nerisidi visumaṁta paḍusavu
javarālanaidivi sādiṁchanobuduve

(||ivim̐||)
sĕlavula navvugŏṁṭā siggulubaḍugŏṁṭānu
talagŏni padigĕṁta tamirĕm̐seve
kaluvala vesugŏṁṭā kaḍusanna sūsugŏṁṭā
valabulu sallisalli valalaṁbĕṭṭeve

(||ivim̐||)
kannulārusugŏṁṭānu kadalu sĕppugŏṁṭānu
pannugayādani nĕṁtabhramayiṁcheve
sannulu sūbugŏṁṭānu saṁgaḍim̐ gūsuṁḍugŏṁṭā
tinnanisem̐tala nĕṭlu teliṁcheve

(||ivim̐||)
sarasamulāḍugŏṁṭā savulusūbugŏṁṭānu
pĕrarem̐pula nĕṁdām̐kā bĕlliṁcheve
aridi śhrīveṁkaḍeśhum̐ḍala melumaṁgabadi
yiravai nannelĕ nim̐ka nemisŏlaseve