ఇట్టుండవలదా మోహ మెంచి చూచితే
(॥పల్లవి॥)
ఇట్టుండవలదా మోహ మెంచి చూచితే
అట్టె చెలులు చూచి అచ్చెరువందేరు
(॥ఇట్టు॥)
చెంగలించు నీమోము చెలిఁ గనుగొంటేనే
చెంగటఁ జేరితే కళ చిమ్మిరేఁగు
అంగమెల్లఁ బులకించు ఆకెమాటలు వింటేను
యింగిత మెరిఁగితిమి యెంత మేలువాఁడవో
(॥ఇట్టు॥)
వడదేరుదువు నీవు వనితఁ బేరుకొంటేను
అడియాలములు చూచి హరుషింతువు
తడబడుఁ దమకము తగ నాపెఁ దలఁచితే
యెడయక కంటిమి నీవెంట మేలువాఁడవో
(॥ఇట్టు॥)
ఆయాలు గరఁగుదువు అలమేల్ మంగ ముట్టితే
చాయదేరు నీమోవి చవిగొంటేను
పాయక కూడితి విదె భావిం చేకెఁ జూచేవు
యీయెడ శ్రీవేంకటేశ యెంతమేలువాఁడవో
(||pallavi||)
iṭṭuṁḍavaladā moha mĕṁchi sūside
aṭṭĕ sĕlulu sūsi achchĕruvaṁderu
(||iṭṭu||)
sĕṁgaliṁchu nīmomu sĕlim̐ ganugŏṁṭene
sĕṁgaḍam̐ jeride kaḽa simmirem̐gu
aṁgamĕllam̐ bulagiṁchu āgĕmāḍalu viṁṭenu
yiṁgida mĕrim̐gidimi yĕṁta meluvām̐ḍavo
(||iṭṭu||)
vaḍaderuduvu nīvu vanidam̐ berugŏṁṭenu
aḍiyālamulu sūsi haruṣhiṁtuvu
taḍabaḍum̐ damagamu taga nābĕm̐ dalam̐side
yĕḍayaga kaṁṭimi nīvĕṁṭa meluvām̐ḍavo
(||iṭṭu||)
āyālu garam̐guduvu alamel maṁga muṭṭide
sāyaderu nīmovi savigŏṁṭenu
pāyaga kūḍidi vidĕ bhāviṁ segĕm̐ jūsevu
yīyĕḍa śhrīveṁkaḍeśha yĕṁtameluvām̐ḍavo