Itti sakkamdanaalellaa nimde kaanamgavachche

ఇట్టి చక్కఁదనాలెల్లా నిందే కానఁగవచ్చె
Language

(॥పల్లవి॥)
ఇట్టి చక్కఁదనాలెల్లా నిందే కానఁగవచ్చె
చుట్టిచు ట్టీపె వొరపు చూడరమ్మ చెలులు

(॥ఇట్టి॥)
నగితే వెన్నెలగాసీ నలినాక్షి సెలవుల
నిగిడి చూచితే మించీ నీలాలరంగు
మొగమెత్తితేఁ దొలఁకీ మోవి మదనకళలు
సొగిసి యీపె వొరపు చూడరమ్మ చెలులు

(॥ఇట్టి॥)
మాటలాడితే మెరచీ మాణికాలు నోరునిండా
పాటించితే నిలువెల్లా బంగారు నిగ్గు
పాటవాడితేఁ బెదవిఁ బచ్చితేనె లూరీని
జూటరి యీపె వొరపు చూడరమ్మ చెలులు

(॥ఇట్టి॥)
పెనఁగితే నురమునఁ బెరిగీని జక్కవలు
చనకితే గొనగోళ్ళఁ జెందీ వజ్రాలు
యెనసె శ్రీవేంకటేశుఁ డీకెఁ గడు మన్నించి
జునుఁగ కీపె వొరపు చూడరమ్మ చెలులు

(||pallavi||)
iṭṭi sakkam̐danālĕllā niṁde kānam̐gavachchĕ
suṭṭisu ṭṭībĕ vŏrabu sūḍaramma sĕlulu

(||iṭṭi||)
nagide vĕnnĕlagāsī nalinākṣhi sĕlavula
nigiḍi sūside miṁchī nīlālaraṁgu
mŏgamĕttidem̐ dŏlam̐kī movi madanagaḽalu
sŏgisi yībĕ vŏrabu sūḍaramma sĕlulu

(||iṭṭi||)
māḍalāḍide mĕrasī māṇigālu noruniṁḍā
pāḍiṁchide niluvĕllā baṁgāru niggu
pāḍavāḍidem̐ bĕdavim̐ bachchidenĕ lūrīni
jūḍari yībĕ vŏrabu sūḍaramma sĕlulu

(||iṭṭi||)
pĕnam̐gide nuramunam̐ bĕrigīni jakkavalu
sanagide gŏnagoḽḽam̐ jĕṁdī vajrālu
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍīgĕm̐ gaḍu manniṁchi
junum̐ga kībĕ vŏrabu sūḍaramma sĕlulu