ఇట్టె నాకు బ్రియము లెంత చెప్పేవు
(॥పల్లవి॥)
ఇట్టె నాకు బ్రియము లెంత చెప్పేవు
నెట్టుకొన్న నా గుణము నీ వెరఁగవా
(॥ఇట్టె॥)
చిత్తగించి నీవేమి సేసినా నియ్యకొనేఁగాక
ఇత్తల నా ఇచ్చల నీ కెదురాడేనా
బత్తితో నీమన్ననలు పదివేలుగాఁ జూచుక
మెత్తుగాక నీ యెడకు మేర మీరేనా
(॥ఇట్టె॥)
నాకు నీవే మానతిచ్చినా సమ్మతించేఁగాక
కాకరితనాల నీతోఁ గాఁతాళించేనా
పైకొన్న నీ యాదరణే కాణాచిగాఁ జేసుకొని
నీకితవై వుందుఁగాక నెపాలెంచేనా
(॥ఇట్టె॥)
యేరీతి నన్నేలినా నెనసి వుండేఁగాక
కూరిమి గొసరి నిన్ను గుంపించేనా
కోరి శ్రీ వేంకటేశ నీకూటమి కొండసేసుక
సారెకు మొక్కదుఁగాక సాదించేనా
(||pallavi||)
iṭṭĕ nāgu briyamu lĕṁta sĕppevu
nĕṭṭugŏnna nā guṇamu nī vĕram̐gavā
(||iṭṭĕ||)
sittagiṁchi nīvemi sesinā niyyagŏnem̐gāga
ittala nā ichchala nī kĕdurāḍenā
battido nīmannanalu padivelugām̐ jūsuga
mĕttugāga nī yĕḍagu mera mīrenā
(||iṭṭĕ||)
nāgu nīve mānadichchinā sammadiṁchem̐gāga
kāgaridanāla nīdom̐ gām̐tāḽiṁchenā
paigŏnna nī yādaraṇe kāṇāsigām̐ jesugŏni
nīgidavai vuṁdum̐gāga nĕbālĕṁchenā
(||iṭṭĕ||)
yerīdi nannelinā nĕnasi vuṁḍem̐gāga
kūrimi gŏsari ninnu guṁpiṁchenā
kori śhrī veṁkaḍeśha nīgūḍami kŏṁḍasesuga
sārĕgu mŏkkadum̐gāga sādiṁchenā