(॥పల్లవి॥)
ఇసుక తక్కరి వంటి దీ వలపు
అసము దించక నవ్వే వది నే నెఱఁగనా
(॥ఇసు॥)
చేరి నేఁ జెనకఁగాను చెనఁకేవు నీవు నన్ను
నీరు కొద్ది దామరాయ నీ వలపు
యీరీతి నెందు వోతివి ఇందాఁకా నే నీకు
నేరుపఁగా నేర్చితివి నే నెఱఁగనా
(॥ఇసు॥)
అండ సరసములు నే నాడినట్టే యాడేవు
నిండు రొంపిలో కంబము నీ వలపు
మెండుగా నేఁ దొలుతనే మేలుబంతి వెట్టియ్యఁగ
కొండసెలవై తూరేవు గుట్టు నే నెఱఁగనా
(॥ఇసు॥)
గుక్కక శ్రీ వేంకటేశ కూడినట్టె కూడేవు
నిక్కి యద్ధములోనీడ నీవలపు
పెక్కురతులు నేఁ దలఁపించఁగాఁ దలఁచుకొని
చొక్కి నన్నుఁ జొక్కించేవు సూటి నే నెఱఁగనా
(||pallavi||)
isuga takkari vaṁṭi dī valabu
asamu diṁchaga navve vadi ne nĕṟam̐ganā
(||isu||)
seri nem̐ jĕnagam̐gānu sĕnam̐kevu nīvu nannu
nīru kŏddi dāmarāya nī valabu
yīrīdi nĕṁdu vodivi iṁdām̐kā ne nīgu
nerubam̐gā nersidivi ne nĕṟam̐ganā
(||isu||)
aṁḍa sarasamulu ne nāḍinaṭṭe yāḍevu
niṁḍu rŏṁpilo kaṁbamu nī valabu
mĕṁḍugā nem̐ dŏludane melubaṁti vĕṭṭiyyam̐ga
kŏṁḍasĕlavai tūrevu guṭṭu ne nĕṟam̐ganā
(||isu||)
gukkaga śhrī veṁkaḍeśha kūḍinaṭṭĕ kūḍevu
nikki yaddhamulonīḍa nīvalabu
pĕkkuradulu nem̐ dalam̐piṁcham̐gām̐ dalam̐sugŏni
sŏkki nannum̐ jŏkkiṁchevu sūḍi ne nĕṟam̐ganā