Issee ne neṟamganaa yeebaadi nenu

ఇస్సీ నే నెఱఁగనా యీపాటి నేను
Language

(॥పల్లవి॥)
ఇస్సీ నే నెఱఁగనా యీపాటి నేను
అస్సారాన నడచేనా అన్నిటా నేను

(॥ఇస్సీ॥)
కేరి కేరి నీవద్ద గెలసి నవ్వుదుఁగాక
నేరములెంచేనా నీతో నేను
ఆరీతినే కొనగోర నాయము లంటుదుఁగాక
బీరము లాడేనా పెనఁగుతా నేను

(॥ఇస్సీ॥)
చన్నుమొనల నరసి చవులు వుట్టింతుఁగాక
నిన్ను నానవెట్టేనా నీతో నేను
వన్నెలు చూపి మోపి వలపు చల్లదుఁగాక
కన్నుల జంకించేనా కసరుతా నేను

(॥ఇస్సీ॥)
గక్కన నిట్టె నిన్నుఁ గాఁగిటఁ గూడుదుఁగాక
నిక్కి నిక్కి చూచేనా నీతో నేను
యిక్కువ శ్రీ వేకంటేశ యిరవైతి విటు నాకు
తక్కల నలయించేనా దక్కఁగొంటి నేను

(||pallavi||)
issī ne nĕṟam̐ganā yībāḍi nenu
assārāna naḍasenā anniḍā nenu

(||issī||)
keri keri nīvadda gĕlasi navvudum̐gāga
neramulĕṁchenā nīdo nenu
ārīdine kŏnagora nāyamu laṁṭudum̐gāga
bīramu lāḍenā pĕnam̐gudā nenu

(||issī||)
sannumŏnala narasi savulu vuṭṭiṁtum̐gāga
ninnu nānavĕṭṭenā nīdo nenu
vannĕlu sūbi mobi valabu salladum̐gāga
kannula jaṁkiṁchenā kasarudā nenu

(||issī||)
gakkana niṭṭĕ ninnum̐ gām̐giḍam̐ gūḍudum̐gāga
nikki nikki sūsenā nīdo nenu
yikkuva śhrī vegaṁṭeśha yiravaidi viḍu nāgu
takkala nalayiṁchenā dakkam̐gŏṁṭi nenu