Irumona soodivale nemdugaunu nee manasu

ఇరుమొన సూదివలె నెందుకౌను నీ మనసు
Language

(॥పల్లవి॥)
ఇరుమొన సూదివలె నెందుకౌను నీ మనసు
నొరసి నట్టనడుమ నున్నాఁడవు గాక

(॥ఇరు॥)
చెనకి గోరనూఁదుచు చెప్పీనదె నీతోను
చనవులు మనవులు సారెకు నాపె
మన సక్కడనే కాక మామీఁద నున్నదా నీకు
చొనపి కన్నుల మమ్ముఁ జూచేవు గాక

(॥ఇరు॥)
సందడిఁ జన్నుల నొత్తి చవులు చూపీ నీతోను
పొందులును విందులును బోరున నాపె
కందువ లాడనేకాక కడునాస ఇందున్నదా
సందు సుడివలపులు చల్లేవు గాక

(॥ఇరు॥)
కూడి కాఁగిటిలోననే కూడపెట్టీ నీతోను
వాడికలు వేడుకలు వరుస నాపె
యీడనె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
వోడక రతుల నింకా నొరసేవు గాక

(||pallavi||)
irumŏna sūdivalĕ nĕṁdugaunu nī manasu
nŏrasi naṭṭanaḍuma nunnām̐ḍavu gāga

(||iru||)
sĕnagi goranūm̐dusu sĕppīnadĕ nīdonu
sanavulu manavulu sārĕgu nābĕ
mana sakkaḍane kāga māmīm̐da nunnadā nīgu
sŏnabi kannula mammum̐ jūsevu gāga

(||iru||)
saṁdaḍim̐ jannula nŏtti savulu sūbī nīdonu
pŏṁdulunu viṁdulunu boruna nābĕ
kaṁduva lāḍanegāga kaḍunāsa iṁdunnadā
saṁdu suḍivalabulu sallevu gāga

(||iru||)
kūḍi kām̐giḍilonane kūḍabĕṭṭī nīdonu
vāḍigalu veḍugalu varusa nābĕ
yīḍanĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
voḍaga radula niṁkā nŏrasevu gāga