Iravai yo shadaabdam idi iravai yo shadaabdam

ఇరవై యో శతాబ్దం ఇది ఇరవై యో శతాబ్దం
Year
Language

పల్లవి:

ఇరవై యో శతాబ్దం ఇది ఇరవై యో శతాబ్దం
ధర్మదేవతకి ఉరికంబం
ప్రపంచ శాంతికి పరాజయం
కలి పురుషుడికి ఇది కిరీటం
కిరాతకులకిది పతాకం
నమ్మక ద్రోహానికి ఇది సింహద్వారం
స్వార్ధ పిశాచికి ఇది క్రీడారంగం

ఇరవై యో శతాబ్దం ఇది ఇరవై యో శతాబ్దం

చరణం 1:

చంద్రుని మీదే పాదం మోపిన శతాబ్దం
నీతిని పాతాళానికి తొక్కిన శతాబ్దం
గుండెలు మార్చి ఆయువుపెంచిన శతాబ్దం
గుప్పెడు మెతుకులు దొరకక సచ్చే శతాబ్దం
అగ్రరాజ్యముల పోషణతో ఉగ్రవదామే బలపడుతూ
సమాజమంత ఎడారి ఘోషల స్మశాన వాటిక అవుతుంటే
విజ్ఞానం వివేకము వేల వేల బోయే శతాబ్దం

ఇరవై యో శతాబ్దం ఇది ఇరవై యో శతాబ్దం

చరణం 2:

బుద్ధుని భోధలు చాటింది ఒక శతాబ్దం
కరుణమయునే శిలువేసిందోక శతాబ్దం
స్వర్ణ యుగంగా వెలుగొందింది ఒక శతాబ్దం
నెత్తురు మడుగులు పొంగించిందోక శతాబ్దం
త్యాగపురుషులుని బలి చేసి జన్మభూమినే అమ్మేసి
అమాయకులపై అధికారంకై అర్రులు చాచే కాలంలో
మధనపడే మనిషి కధే ఈ ఇరవై యో శతాబ్దం

ఇరవై యో శతాబ్దం ఇది ఇరవై యో శతాబ్దం
ధర్మదేవతకు ఉరికంబం
ప్రపంచ శాంతికి పరాజయం
కలి పురుషుడికి ఇది కిరీటం
కిరాతకులకిది పతాకం
నమ్మక ద్రోహానికి ఇది సింహద్వారం
స్వార్ధ పిశాచికి ఇది క్రీడారంగం
ఇరవై యో శతాబ్దం ఇది ఇరవై యో శతాబ్దం

pallavi:

iravai yo śhadābdaṁ idi iravai yo śhadābdaṁ
dharmadevadagi urigaṁbaṁ
prabaṁcha śhāṁtigi parājayaṁ
kali puruṣhuḍigi idi kirīḍaṁ
kirādagulagidi padāgaṁ
nammaga drohānigi idi siṁhadvāraṁ
svārdha piśhāsigi idi krīḍāraṁgaṁ

iravai yo śhadābdaṁ idi iravai yo śhadābdaṁ

saraṇaṁ 1:

saṁdruni mīde pādaṁ mobina śhadābdaṁ
nīdini pādāḽānigi tŏkkina śhadābdaṁ
guṁḍĕlu mārsi āyuvubĕṁchina śhadābdaṁ
guppĕḍu mĕdugulu dŏragaka sachche śhadābdaṁ
agrarājyamula poṣhaṇado ugravadāme balabaḍudū
samājamaṁta ĕḍāri ghoṣhala smaśhāna vāḍiga avuduṁṭe
vijñānaṁ vivegamu vela vela boye śhadābdaṁ

iravai yo śhadābdaṁ idi iravai yo śhadābdaṁ

saraṇaṁ 2:

buddhuni bhodhalu sāḍiṁdi ŏga śhadābdaṁ
karuṇamayune śhiluvesiṁdoga śhadābdaṁ
svarṇa yugaṁgā vĕlugŏṁdiṁdi ŏga śhadābdaṁ
nĕtturu maḍugulu pŏṁgiṁchiṁdoga śhadābdaṁ
tyāgaburuṣhuluni bali sesi janmabhūmine ammesi
amāyagulabai adhigāraṁkai arrulu sāse kālaṁlo
madhanabaḍe maniṣhi kadhe ī iravai yo śhadābdaṁ

iravai yo śhadābdaṁ idi iravai yo śhadābdaṁ
dharmadevadagu urigaṁbaṁ
prabaṁcha śhāṁtigi parājayaṁ
kali puruṣhuḍigi idi kirīḍaṁ
kirādagulagidi padāgaṁ
nammaga drohānigi idi siṁhadvāraṁ
svārdha piśhāsigi idi krīḍāraṁgaṁ
iravai yo śhadābdaṁ idi iravai yo śhadābdaṁ