ఇప్పుఁ డాతని మనసు యెట్టున్నదో తెలియరే
(॥పల్లవి॥)
ఇప్పుఁ డాతని మనసు యెట్టున్నదో తెలియరే
చెప్పినట్టు మీ మాఁట సేసేఁగాని
(॥ఇప్పు॥)
వొనరినపొందులైతే వొడఁబరచుటఁగాక
మనసు రాకుండితేను మాటాడేదేమి
కనువిచ్చి చూచితేను కానుక యీవచ్చుఁగాక
మునుపే తలవంచితే ముందరికి వత్తురా
(॥ఇప్పు॥)
ఆసపడి యుండితేను అట్టె నవ్వవచ్చుఁగాక
వేసరఁగాఁ జెనకితే వేడుకయ్యీనా
వాసితోనే నడిపితే వాడికై వుండుటగాక
వేసాలకు వేఁడుకోంటే వినయమేమిటికి
(॥ఇప్పు॥)
కలసి కాఁగిలించితే కరఁగఁగవచ్చుఁ గాక
తలఁచి గుట్టున నుంటే తనివయ్యీనా
అలరి శ్రీవేంకటేశుఁ డాదరించి నన్నుఁ గూడె
నెలవై నిన్నటిరతి నేఁటిక వచ్చీనా
(||pallavi||)
ippum̐ ḍādani manasu yĕṭṭunnado tĕliyare
sĕppinaṭṭu mī mām̐ṭa sesem̐gāni
(||ippu||)
vŏnarinabŏṁdulaide vŏḍam̐barasuḍam̐gāga
manasu rāguṁḍidenu māḍāḍedemi
kanuvichchi sūsidenu kānuga yīvachchum̐gāga
munube talavaṁchide muṁdarigi vatturā
(||ippu||)
āsabaḍi yuṁḍidenu aṭṭĕ navvavachchum̐gāga
vesaram̐gām̐ jĕnagide veḍugayyīnā
vāsidone naḍibide vāḍigai vuṁḍuḍagāga
vesālagu vem̐ḍugoṁṭe vinayamemiḍigi
(||ippu||)
kalasi kām̐giliṁchide karam̐gam̐gavachchum̐ gāga
talam̐si guṭṭuna nuṁṭe tanivayyīnā
alari śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi nannum̐ gūḍĕ
nĕlavai ninnaḍiradi nem̐ṭiga vachchīnā