ఇప్పుడుఁగా నీవు నేను ఇద్దరమూ గూడితిమి
(॥పల్లవి॥)
ఇప్పుడుఁగా నీవు నేను ఇద్దరమూ గూడితిమి
పుప్పొడిఁ దేనియు నొకపువ్వున నున్నట్టు
(॥ఇప్పు॥)
నిన్నుఁ బాసి కొంతవడి నీగుణాలు దలఁచితి
వెన్నెలగాసినయట్టు వేసఁగి లోన
విన్నవినుకులలోన వేడక నోలలాడుదు
వెన్నలు వుట్టిన యట్టు వేఁడిపాలలోన
(॥ఇప్పు॥)
తెరమఱఁగున నుండే తియ్యని మోవి చూపుదు
పెరలో తేనె వున్నట్టు పెరుగుతాను
సరుగ నీ చెలులతో సరసము లాడుదు
గరిమ మెఱుఁగు మేఘము నందుకొన్నట్టు
(॥ఇప్పు॥)
ఇట్టె దగ్గరుతానే యెదురుచేతులు చాఁతు
కట్టలు వరచినట్టు కన్నందుకెల్లా
రట్టుగ శ్రీ వేంకటేశ ముట్టి రతిఁ జొక్కించితి
పట్టుమని ఇచ్చినట్టు భాగ్యము లన్నియును
(||pallavi||)
ippuḍum̐gā nīvu nenu iddaramū gūḍidimi
puppŏḍim̐ deniyu nŏgabuvvuna nunnaṭṭu
(||ippu||)
ninnum̐ bāsi kŏṁtavaḍi nīguṇālu dalam̐sidi
vĕnnĕlagāsinayaṭṭu vesam̐gi lona
vinnavinugulalona veḍaga nolalāḍudu
vĕnnalu vuṭṭina yaṭṭu vem̐ḍibālalona
(||ippu||)
tĕramaṟam̐guna nuṁḍe tiyyani movi sūbudu
pĕralo tenĕ vunnaṭṭu pĕrugudānu
saruga nī sĕlulado sarasamu lāḍudu
garima mĕṟum̐gu meghamu naṁdugŏnnaṭṭu
(||ippu||)
iṭṭĕ daggarudāne yĕdurusedulu sām̐tu
kaṭṭalu varasinaṭṭu kannaṁdugĕllā
raṭṭuga śhrī veṁkaḍeśha muṭṭi radim̐ jŏkkiṁchidi
paṭṭumani ichchinaṭṭu bhāgyamu lanniyunu