ఇప్పుడు వేగిరమేలే యింతలోఁ దాను
(॥పల్లవి॥)
ఇప్పుడు వేగిరమేలే యింతలోఁ దాను
కొప్పు వీడె నిదె నాకుఁ గూడవచ్చేఁ బదవే
(॥ఇప॥)
నాటకాన బూటకాన నవ్వివచ్చితి నిందాఁక
యేఁటికిఁ బిలువనంపె నిట్టే తాను
కాటుక కన్నుల నాకు కమ్మీ నిద్దుర నేఁడు
నేఁట నే తప్పీనా రేపు నే వచ్చేఁబదవే
(॥ఇప॥)
పొంతనాల మంతనాల పొద్దువుచ్చితి నిందాఁక
అంతలో లేకలేలంపె నప్పుడే తాను
చెంతల కస్తూరిబొట్టు చెదరె నీవేళ నాకు
వంతుకు నే మాపటంత వచ్చేఁ బదవే
(॥ఇప॥)
వొడఁబాటు తడఁబాటు నొప్పి వచ్చితి నిందాఁక
బడి నీడకేల వచ్చెఁ బదరి తాను
యెడచొచ్చి శ్రీవేంకటేశుఁడిట్టె నన్నుఁగూడె
వడి మీమనసులెల్లా వచ్చెఁగద పదవే
(||pallavi||)
ippuḍu vegiramele yiṁtalom̐ dānu
kŏppu vīḍĕ nidĕ nāgum̐ gūḍavachchem̐ badave
(||iba||)
nāḍagāna būḍagāna navvivachchidi niṁdām̐ka
yem̐ṭigim̐ biluvanaṁpĕ niṭṭe tānu
kāḍuga kannula nāgu kammī niddura nem̐ḍu
nem̐ṭa ne tappīnā rebu ne vachchem̐badave
(||iba||)
pŏṁtanāla maṁtanāla pŏdduvuchchidi niṁdām̐ka
aṁtalo legalelaṁpĕ nappuḍe tānu
sĕṁtala kastūribŏṭṭu sĕdarĕ nīveḽa nāgu
vaṁtugu ne mābaḍaṁta vachchem̐ badave
(||iba||)
vŏḍam̐bāḍu taḍam̐bāḍu nŏppi vachchidi niṁdām̐ka
baḍi nīḍagela vachchĕm̐ badari tānu
yĕḍasŏchchi śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ nannum̐gūḍĕ
vaḍi mīmanasulĕllā vachchĕm̐gada padave