Ippudu nee vemaadina yemmelamduvu

ఇప్పుడు నీ వేమాడిన యెమ్మెలందువు
Language

(॥పల్లవి॥)
ఇప్పుడు నీ వేమాడిన యెమ్మెలందువు
చప్పుడు సేయక నుంటే చవివుట్టీ నపుడు

(॥ఇప్పు॥)
చలము సాదించవద్దు సవతి మచ్చరమున
చెలువునికి బుద్దులు చెప్పవమ్మా
వలచిన సవతి నేను వద్దనుండే నావేళ
తెలుసుకొందము నీనా తేజమెల్లా నపుడు

(॥ఇప్పు॥)
కుచ్చితము సేయవద్దు గుణము మంకుఁ దనాన
పెచ్చు వెరిగి పతితోఁ బెనఁగవమ్మా
మెచ్చుల నాచనవులు మెరసేను ఆవేళ
కచ్చు పెట్టి నీ నా నేర్పు కనుకొంద మపుడు

(॥ఇప్పు॥)
మనసు చూడఁగవద్దు మాయదారి తనమున
యెనసి విభుని కప్పణియ్య వమ్మా
చెనకి నన్నుఁ గూడెను శ్రీవేంకటేశుఁడితఁడు
నిను మెచ్చి నీకరుణ నించుకొనే నపుడు

(||pallavi||)
ippuḍu nī vemāḍina yĕmmĕlaṁduvu
sappuḍu seyaga nuṁṭe savivuṭṭī nabuḍu

(||ippu||)
salamu sādiṁchavaddu savadi machcharamuna
sĕluvunigi buddulu sĕppavammā
valasina savadi nenu vaddanuṁḍe nāveḽa
tĕlusugŏṁdamu nīnā tejamĕllā nabuḍu

(||ippu||)
kuchchidamu seyavaddu guṇamu maṁkum̐ danāna
pĕchchu vĕrigi padidom̐ bĕnam̐gavammā
mĕchchula nāsanavulu mĕrasenu āveḽa
kachchu pĕṭṭi nī nā nerbu kanugŏṁda mabuḍu

(||ippu||)
manasu sūḍam̐gavaddu māyadāri tanamuna
yĕnasi vibhuni kappaṇiyya vammā
sĕnagi nannum̐ gūḍĕnu śhrīveṁkaḍeśhum̐ḍidam̐ḍu
ninu mĕchchi nīgaruṇa niṁchugŏne nabuḍu