Ippudu nannadigevu yeppudu vachchidivani

ఇప్పుడు నన్నడిగేవు యెప్పుడు వచ్చితివని
Language

(॥పల్లవి॥)
ఇప్పుడు నన్నడిగేవు యెప్పుడు వచ్చితివని
కప్పురాన వేయనా నీ కతలెట్టివోకాని

(॥ఇప్పు॥)
విన్నవించనా నేను వీనులు చల్లఁగా నీకు
కన్నులను మొక్కనా కమ్మటి నేను
సన్నసేసి చూపనా చవిగా నా మోవితేనె
వున్నతి నెందుఁ బరాకై వుంటివోకాని

(॥ఇప్పు॥)
చేతులారా వేఁడుకోనా చెక్కునొక్కి నే నీకు
కాతరాన నీవేళ గాచుకండనా
రాతిరెల్లా నిట్టె జాగరాలు నీతోఁ జేయనా
యే తలపోఁతలతో నీవెటుంటివోకాని

(॥ఇప్పు॥)
పాదాలు నీకొత్తనా పానుపుపై నుండఁగాను
పోది సేస విడె మిచ్చి పొందు సేయనా
యీదెస శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి
పాదుకొని నాపై నెంత బత్తి నుంటివో కాని

(||pallavi||)
ippuḍu nannaḍigevu yĕppuḍu vachchidivani
kappurāna veyanā nī kadalĕṭṭivogāni

(||ippu||)
vinnaviṁchanā nenu vīnulu sallam̐gā nīgu
kannulanu mŏkkanā kammaḍi nenu
sannasesi sūbanā savigā nā movidenĕ
vunnadi nĕṁdum̐ barāgai vuṁṭivogāni

(||ippu||)
sedulārā vem̐ḍugonā sĕkkunŏkki ne nīgu
kādarāna nīveḽa gāsugaṁḍanā
rādirĕllā niṭṭĕ jāgarālu nīdom̐ jeyanā
ye talabom̐talado nīvĕḍuṁṭivogāni

(||ippu||)
pādālu nīgŏttanā pānububai nuṁḍam̐gānu
podi sesa viḍĕ michchi pŏṁdu seyanā
yīdĕsa śhrīveṁkaḍeśha yiṁtalo nannelidivi
pādugŏni nābai nĕṁta batti nuṁṭivo kāni