ఇప్పుడు మా రతివేళ నిన్నిపొందులు
(॥పల్లవి॥)
ఇప్పుడు మా రతివేళ నిన్నిపొందులు
తప్పకుండాఁ దలఁచుకో తనిసేవు పొందులు
(॥ఇప్పు॥)
వెన్నలారగించేనాఁటివేఁడివేఁడి పొందులూ
చన్నులకొనలనొత్తేచద్దిపొందులూ
అన్నిటా రాసక్రీడ యమునలో పొందులూ
మున్నిటివి దలఁచుకో ముచ్చటలపొందులూ
(॥ఇప్పు॥)
చల్లలమ్మేచోట్ల సరసపుపొందులూ
పిల్లఁగోవిరాగాల పెనుపొందులు
తొల్లి నీవుగాచుకున్న దొడ్డిపొంతపొందులూ
వెల్లవిరిఁ దలఁచుకో వేడుక నీపొందులు
(॥ఇప్పు॥)
ఆవులఁ బితికేటిఆనవాల పొందులూ
కావరపుమందల పొంగటి(లి?) పొందులూ
యీవేళ శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడీతిని
గోవాళుఁడ తలఁచుకో గొల్లవారిపొందులూ
(||pallavi||)
ippuḍu mā radiveḽa ninnibŏṁdulu
tappaguṁḍām̐ dalam̐sugo tanisevu pŏṁdulu
(||ippu||)
vĕnnalāragiṁchenām̐ṭivem̐ḍivem̐ḍi pŏṁdulū
sannulagŏnalanŏttesaddibŏṁdulū
anniḍā rāsakrīḍa yamunalo pŏṁdulū
munniḍivi dalam̐sugo muchchaḍalabŏṁdulū
(||ippu||)
sallalammesoṭla sarasabubŏṁdulū
pillam̐govirāgāla pĕnubŏṁdulu
tŏlli nīvugāsugunna dŏḍḍibŏṁtabŏṁdulū
vĕllavirim̐ dalam̐sugo veḍuga nībŏṁdulu
(||ippu||)
āvulam̐ bidigeḍiānavāla pŏṁdulū
kāvarabumaṁdala pŏṁgaḍi(li?) pŏṁdulū
yīveḽa śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍīdini
govāḽum̐ḍa talam̐sugo gŏllavāribŏṁdulū