ఇప్పుడిట్టె వింటిమి నీవేల నవ్వేవు
(॥పల్లవి॥)
ఇప్పుడిట్టె వింటిమి నీవేల నవ్వేవు
చెప్పితేను దోసమా సిగ్గువడనేఁటికి
(॥ఇప్పు॥)
అంగన విచ్చేసి నేఁడు ఆయమైననీమోవి
యెంగిలిసేసినదట ఇది నిజమా
కుంగకుండేయటు వంటి కుచముల కొనలను
అంగవించి వొత్తెనట అది నిజమా
(॥ఇప్పు॥)
వొక్కమంచముపై నుండి వొడఁబడఁజెప్పి నీ-
యిక్కువ లంటినదట యిది నిజమా
చక్కనితనపాదాలు సారె నీమై సోఁకించి
అక్కర దీరిచేనట అది నిజమా
(॥ఇప్పు॥)
నీవు నేనుఁ గూడుండఁగా నెమ్మది శ్రీవేంకటేశ
యీవేళఁ దా నున్నదట యిది నిజమా
వోవరిలో మిగిలినవూడిగాలెల్లాఁ జేసి
ఆవటించి మొక్కెనట అది నిజమా
(||pallavi||)
ippuḍiṭṭĕ viṁṭimi nīvela navvevu
sĕppidenu dosamā sigguvaḍanem̐ṭigi
(||ippu||)
aṁgana vichchesi nem̐ḍu āyamainanīmovi
yĕṁgilisesinadaḍa idi nijamā
kuṁgaguṁḍeyaḍu vaṁṭi kusamula kŏnalanu
aṁgaviṁchi vŏttĕnaḍa adi nijamā
(||ippu||)
vŏkkamaṁchamubai nuṁḍi vŏḍam̐baḍam̐jĕppi nī-
yikkuva laṁṭinadaḍa yidi nijamā
sakkanidanabādālu sārĕ nīmai som̐kiṁchi
akkara dīrisenaḍa adi nijamā
(||ippu||)
nīvu nenum̐ gūḍuṁḍam̐gā nĕmmadi śhrīveṁkaḍeśha
yīveḽam̐ dā nunnadaḍa yidi nijamā
vovarilo migilinavūḍigālĕllām̐ jesi
āvaḍiṁchi mŏkkĕnaḍa adi nijamā