Ippudemi dappiboya nimtalone

ఇప్పుడేమి దప్పిపోయ నింతలోనె
Language

(॥పల్లవి॥)
ఇప్పుడేమి దప్పిపోయ నింతలోనె
కప్పుక యాతఁడు నాపైఁ గరుణించీఁ గాక

(॥ఇప్పు॥)
విడువనిపతిఁ బాసి విరహానఁ బొరలఁగ
పడఁతులిందరి కాడఁబట్టాయఁగా
యెడరైతి నొకవేళ యేమిసేయవచ్చు మాటఁ
బడవలెఁగాక ఇట్టె పదరనేలే

(॥ఇప్పు॥)
అలిగి యాతఁడు నేను నవ్వలిమోమైతే
పొలఁతులకును నవ్వఁబొద్దాయఁగా
తలము దప్పినవేళ దానికేమి గొరాయ
వలసినట్లయ్యీని వగవకువే

(॥ఇప్పు॥)
యెన్నికతో శ్రీవేంకటేశుఁడు గూడఁగ నన్ను
మున్నిటివారిసొంపు మూలఁబడెఁగా
అన్నువ నప్నటిచేఁత లట్లాయ నేఁ డిప్పు
డిన్నిటాఁ బంతము చెల్లె నిఁకనేఁటికే

(||pallavi||)
ippuḍemi dappiboya niṁtalonĕ
kappuga yādam̐ḍu nābaim̐ garuṇiṁchīm̐ gāga

(||ippu||)
viḍuvanibadim̐ bāsi virahānam̐ bŏralam̐ga
paḍam̐tuliṁdari kāḍam̐baṭṭāyam̐gā
yĕḍaraidi nŏgaveḽa yemiseyavachchu māḍam̐
baḍavalĕm̐gāga iṭṭĕ padaranele

(||ippu||)
aligi yādam̐ḍu nenu navvalimomaide
pŏlam̐tulagunu navvam̐bŏddāyam̐gā
talamu dappinaveḽa dānigemi gŏrāya
valasinaṭlayyīni vagavaguve

(||ippu||)
yĕnnigado śhrīveṁkaḍeśhum̐ḍu gūḍam̐ga nannu
munniḍivārisŏṁpu mūlam̐baḍĕm̐gā
annuva napnaḍisem̐ta laṭlāya nem̐ ḍippu
ḍinniḍām̐ baṁtamu sĕllĕ nim̐kanem̐ṭige