ఇప్పుడే విచారించుకో యింతయు నీవు
(॥పల్లవి॥)
ఇప్పుడే విచారించుకో యింతయు నీవు
అప్పుడు నాతో నౌఁగా దనరాదు నీకు
(॥ఇప్పు॥)
యిందరివలెనే నీవిప్పటికిఁ గూడి నన్ను
సందడిఁ బెట్టేనంటే సమ్మతించ రా
పందెమాడినట్లనే పదియుఁ బదియుగా, నా-
కందువనే వుండవలె కలకాలము
(॥ఇప్పు॥)
తక్కులుఁ దెక్కులు నాడి తగులఁ దీసుక నా-
యిక్కువలంట(టే?) నంటే వియ్యకొన రా
వొక్కటినొక్కటి నా వొడఁబాటు నాకంటే
మక్కువ నితరులను మన్నించరాదు
(॥ఇప్పు॥)
యీయెడనే శ్రీవేంకటేశ నాకు దక్కితివి
నీయింతులు వరుసంటే నే నియ్యరా
యేయెడ బలుకుబంత మేకముగ నా కాగిట
రేయుఁబగలు బాయక రిచ్చవడవలెనా(రా?)
(||pallavi||)
ippuḍe visāriṁchugo yiṁtayu nīvu
appuḍu nādo naum̐gā danarādu nīgu
(||ippu||)
yiṁdarivalĕne nīvippaḍigim̐ gūḍi nannu
saṁdaḍim̐ bĕṭṭenaṁṭe sammadiṁcha rā
paṁdĕmāḍinaṭlane padiyum̐ badiyugā, nā-
kaṁduvane vuṁḍavalĕ kalagālamu
(||ippu||)
takkulum̐ dĕkkulu nāḍi tagulam̐ dīsuga nā-
yikkuvalaṁṭa(ṭe?) naṁṭe viyyagŏna rā
vŏkkaḍinŏkkaḍi nā vŏḍam̐bāḍu nāgaṁṭe
makkuva nidarulanu manniṁcharādu
(||ippu||)
yīyĕḍane śhrīveṁkaḍeśha nāgu dakkidivi
nīyiṁtulu varusaṁṭe ne niyyarā
yeyĕḍa balugubaṁta megamuga nā kāgiḍa
reyum̐bagalu bāyaga richchavaḍavalĕnā(rā?)