ఇప్పుడే నేరుచుకొంటి వేడలేని కుచ్చితము
(॥పల్లవి॥)
ఇప్పుడే నేరుచుకొంటి వేడలేని కుచ్చితము
చిప్పిల నద్దముచూచి సింగారించుకొనేవు
(॥ఇప్పు॥)
కాంత నిన్ను వేఁడుకొనీ కతలు చెప్పఁగరాదా
ఇంతలో నిద్రించేనంటానేల పవ్వళించేవు
అంతలోనే విడెమిచ్చీ హస్తము చాఁచరాదా
పంతాననేల చిత్తరుప్రతిమఁ జూచేవు
(॥ఇప్పు॥)
సతి వేడుకపడీని చదురంగమాడరాదా
తతిఁబాడీనంటానేల దండె మీటేవు
రతిఁ బూలుముడిచీ శిరసు వంచరాదా నేఁడు
కతలుగా సొమ్ములు లెక్కలు వెట్టేవు
(॥ఇప్పు॥)
వెలఁది బాఁతిపడీని వినోదాలు చూపరాదా
సొలసి కూడి యెంతని చొక్కించేవు
అలరి శ్రీవేంకటేశ అదె మొక్కీఁ జూడరాదా
మెలఁగి ఇందుకె సారె మెచ్చులు మెచ్చేవు
(||pallavi||)
ippuḍe nerusugŏṁṭi veḍaleni kuchchidamu
sippila naddamusūsi siṁgāriṁchugŏnevu
(||ippu||)
kāṁta ninnu vem̐ḍugŏnī kadalu sĕppam̐garādā
iṁtalo nidriṁchenaṁṭānela pavvaḽiṁchevu
aṁtalone viḍĕmichchī hastamu sām̐sarādā
paṁtānanela sittarupradimam̐ jūsevu
(||ippu||)
sadi veḍugabaḍīni saduraṁgamāḍarādā
tadim̐bāḍīnaṁṭānela daṁḍĕ mīḍevu
radim̐ būlumuḍisī śhirasu vaṁcharādā nem̐ḍu
kadalugā sŏmmulu lĕkkalu vĕṭṭevu
(||ippu||)
vĕlam̐di bām̐tibaḍīni vinodālu sūbarādā
sŏlasi kūḍi yĕṁtani sŏkkiṁchevu
alari śhrīveṁkaḍeśha adĕ mŏkkīm̐ jūḍarādā
mĕlam̐gi iṁdugĕ sārĕ mĕchchulu mĕchchevu