Ippadi nee semte vogadinumadai podasoobee

ఇప్పటి నీ చేఁతే వొకటినుమడై పొడచూపీ
Language

(॥పల్లవి॥)
ఇప్పటి నీ చేఁతే వొకటినుమడై పొడచూపీ
దప్పితో సిగ్గువడకు తారుకాణయ్యీని

(॥ఇప్ప॥)
సారెసారె నవ్వకువే సరి నవె వెన్నెలలై
ఆరయ విరహవేళల నలయించీని
మేరమీరి వల్కకువే మించి యివె తేనెలై
తేరుకొని నిన్నుఁ దరితీపులఁబెట్టీని

(॥ఇప్ప॥)
తప్పకచూడకువే తగుచూపులే యమ్ములై
యప్పటి నలిగితే నాయము గాఁడీని
వుప్పటించి జంకించకు వూర కవి పొగలై
ముప్పిరిఁ దాపాగ్ని రాఁజమొదలుసేసీని

(॥ఇప్ప॥)
సరసములాడకువే సారే బాహులతలై
సొరిదిఁ గాఁగిట నవె చుట్టుకొనీని
యిరవై శ్రీవేంకటాద్రి నిద్దరముఁ గూడితిమి
విరుల వేయకువే వేడుకరేఁచీని

(||pallavi||)
ippaḍi nī sem̐te vŏgaḍinumaḍai pŏḍasūbī
dappido sigguvaḍagu tārugāṇayyīni

(||ippa||)
sārĕsārĕ navvaguve sari navĕ vĕnnĕlalai
āraya virahaveḽala nalayiṁchīni
meramīri valgaguve miṁchi yivĕ tenĕlai
terugŏni ninnum̐ daridībulam̐bĕṭṭīni

(||ippa||)
tappagasūḍaguve tagusūbule yammulai
yappaḍi naligide nāyamu gām̐ḍīni
vuppaḍiṁchi jaṁkiṁchagu vūra kavi pŏgalai
muppirim̐ dābāgni rām̐jamŏdalusesīni

(||ippa||)
sarasamulāḍaguve sāre bāhuladalai
sŏridim̐ gām̐giḍa navĕ suṭṭugŏnīni
yiravai śhrīveṁkaḍādri niddaramum̐ gūḍidimi
virula veyaguve veḍugarem̐sīni