ఇప్పటనుంటీ గొసరనేమిటికి నింతలోనే
(॥పల్లవి॥)
ఇప్పటనుంటీ గొసరనేమిటికి నింతలోనే
తప్పీనా తానే ఆ సుద్ది దడవీఁ గాని
(॥॥)
రయమున విరహాన రాఁగిననన్నుఁ జూచితే
దయ వుట్టకుండునా తనకైనాను
ప్రియములు చెప్పియైనాఁ బిలువవే యిక్కడికి
నియతానఁ దానే మన్నించీఁగాని
(॥॥)
వెగటులేని నావిన్నపములెల్లా వింటే
చిగిరించకుండునా చిత్తమైనాను
మొగము చూడుమనవే ముచ్చటయ్యీనిదే నేఁడు
జగమెల్లా మెచ్చఁగాను చనువిచ్చీఁగాని
(॥॥)
గుఱుతుగా నన్ను నిట్టె కూడినాఁడు ఇటులైతే
చిఱునవ్వు రాకుండునా సెలవినైనా
యెఱిఁగి శ్రీవేంకటేశుఁడేలె నన్ను విడెమీవే
జఱయుచుఁ దనమోవి చవిచూపీఁగాని
(||pallavi||)
ippaḍanuṁṭī gŏsaranemiḍigi niṁtalone
tappīnā tāne ā suddi daḍavīm̐ gāni
(||||)
rayamuna virahāna rām̐ginanannum̐ jūside
daya vuṭṭaguṁḍunā tanagainānu
priyamulu sĕppiyainām̐ biluvave yikkaḍigi
niyadānam̐ dāne manniṁchīm̐gāni
(||||)
vĕgaḍuleni nāvinnabamulĕllā viṁṭe
sigiriṁchaguṁḍunā sittamainānu
mŏgamu sūḍumanave muchchaḍayyīnide nem̐ḍu
jagamĕllā mĕchcham̐gānu sanuvichchīm̐gāni
(||||)
guṟudugā nannu niṭṭĕ kūḍinām̐ḍu iḍulaide
siṟunavvu rāguṁḍunā sĕlavinainā
yĕṟim̐gi śhrīveṁkaḍeśhum̐ḍelĕ nannu viḍĕmīve
jaṟayusum̐ danamovi savisūbīm̐gāni