(॥పల్లవి॥)
ఇప్పటనుండి మాటలేలరా వోరి
కొప్పువట్టి తీసినఁగా కోపము మానేది
(॥ఇప్ప॥)
చెక్కులపై, జేఁతలెల్లాఁ జేసినయప్పుడుగా
తక్కక నే నాడినపంతము వచ్చేది
పిక్కటిల్లు నీమోవి పిప్పి సేసినప్పుడుగా
చిక్కించి నామనసు నెంజిరివి దూరేది
(॥ఇప్ప॥)
సాగ్గు వాపి ప్రియములు చెప్పింకొన్నప్పుడుగా
తగ్గ కిందరిలో నాఁటదాన నయ్యేది
వొగ్గి చెప్పరానిపని కొడిగట్టించితేఁగా
నిగ్గుల నా కోరికలు నెరవేరేది
(॥ఇప్ప॥)
పాదాలపై యానకు లోఁబరచినప్పుడాగా
కాదనక నాచలము గానవచ్చేది
యీదెన శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిటు
మోదమున నేఁడుగదా మొక్కులు చెల్లేది
(||pallavi||)
ippaḍanuṁḍi māḍalelarā vori
kŏppuvaṭṭi tīsinam̐gā kobamu mānedi
(||ippa||)
sĕkkulabai, jem̐talĕllām̐ jesinayappuḍugā
takkaga ne nāḍinabaṁtamu vachchedi
pikkaḍillu nīmovi pippi sesinappuḍugā
sikkiṁchi nāmanasu nĕṁjirivi dūredi
(||ippa||)
sāggu vābi priyamulu sĕppiṁkŏnnappuḍugā
tagga kiṁdarilo nām̐ṭadāna nayyedi
vŏggi sĕpparānibani kŏḍigaṭṭiṁchidem̐gā
niggula nā korigalu nĕraveredi
(||ippa||)
pādālabai yānagu lom̐barasinappuḍāgā
kādanaga nāsalamu gānavachchedi
yīdĕna śhrīveṁkaḍeśha yelidivi nannu niḍu
modamuna nem̐ḍugadā mŏkkulu sĕlledi