ఇన్నియుఁ దనతోఁగాక ఇఁక మరి కలదా
(॥పల్లవి॥)
ఇన్నియుఁ దనతోఁగాక ఇఁక మరి కలదా
యెన్నిరాని పరవశ మెవ్వరి సొమ్మే
(॥ఇన్ని॥)
మాటలాడకుండితేను మాననీవే కొసరఁగ-
నేఁటికే మౌనవ్రత మెవ్వరిసొమ్మే
యీటులేనిమోము చూడకున్న నుండనీవే
కాటుకకన్నులనీటికాలు వెవ్వరిసొమ్మే
(॥ఇన్ని॥)
నవ్వకుండితేఁ బోనీవే నాకు నింకాఁ దనకుఁగా-
నివ్వలఁ జెక్కిటిచే యెవ్వరిసొమ్మే
దవ్వుగాక వద్దనుండి తడవకున్నఁ బోనీవే
చివ్వన బానుపుమీఁద సిగ్గు లెవ్వరిసొమ్మే
(॥ఇన్ని॥)
కూడినరతులవేళ కొంకకున్న లేలేవే
యీడులేనిబుసకొట్టు లెవ్వరిసొమ్మే
జోడై శ్రీవేంకటపతి చొక్కించే నౌనౌనే
వీడెపుమోవిఁ జేసేటివింత లెవ్వరిసొమ్మే
(||pallavi||)
inniyum̐ danadom̐gāga im̐ka mari kaladā
yĕnnirāni paravaśha mĕvvari sŏmme
(||inni||)
māḍalāḍaguṁḍidenu mānanīve kŏsaram̐ga-
nem̐ṭige maunavrada mĕvvarisŏmme
yīḍulenimomu sūḍagunna nuṁḍanīve
kāḍugagannulanīḍigālu vĕvvarisŏmme
(||inni||)
navvaguṁḍidem̐ bonīve nāgu niṁkām̐ danagum̐gā-
nivvalam̐ jĕkkiḍise yĕvvarisŏmme
davvugāga vaddanuṁḍi taḍavagunnam̐ bonīve
sivvana bānubumīm̐da siggu lĕvvarisŏmme
(||inni||)
kūḍinaradulaveḽa kŏṁkagunna leleve
yīḍulenibusagŏṭṭu lĕvvarisŏmme
joḍai śhrīveṁkaḍabadi sŏkkiṁche naunaune
vīḍĕbumovim̐ jeseḍiviṁta lĕvvarisŏmme