Innimtigi selavugaa nidigo neegu mokkenu

ఇన్నింటికి సెలవుగా నిదిగో నీకు మొక్కేను
Language

(॥పల్లవి॥)
ఇన్నింటికి సెలవుగా నిదిగో నీకు మొక్కేను
మన్నించి నాపై కరుణ మఱవకువయ్యా

(॥ఇన్ని॥)
కలికితనాల నిన్ను కడుఁగడుఁ గొసరితి
కలకల నవ్వి నవ్వి కరఁగించితి
మొలక చన్నుల నొత్తి మొగమోడించితి నిన్ను
యెలమి నా వుద్దండాలు యెన్నిలేవయ్యా

(॥ఇన్ని॥)
సారెకు వలపు చల్లి చనవు సాదించితి
కూరిమిగొసరి నిన్ను గుంపించితి
పేరుకొని నా యెంగిలి పెద్దవులఁ బిలిచితి
యీరీతి నా తమకము యేమి చెప్పీనయ్యా

(॥ఇన్ని॥)
చక్కదనములు చూచి సరసము లాడితి
పెక్కులాగుల రతులఁ బెనఁగితి
యిక్కువలంటి శ్రీవేంకటేశ నన్ను నేలితివి
యిక్కడ నా కోరికలు యీడేరెనయ్యా

(||pallavi||)
inniṁṭigi sĕlavugā nidigo nīgu mŏkkenu
manniṁchi nābai karuṇa maṟavaguvayyā

(||inni||)
kaligidanāla ninnu kaḍum̐gaḍum̐ gŏsaridi
kalagala navvi navvi karam̐giṁchidi
mŏlaga sannula nŏtti mŏgamoḍiṁchidi ninnu
yĕlami nā vuddaṁḍālu yĕnnilevayyā

(||inni||)
sārĕgu valabu salli sanavu sādiṁchidi
kūrimigŏsari ninnu guṁpiṁchidi
perugŏni nā yĕṁgili pĕddavulam̐ bilisidi
yīrīdi nā tamagamu yemi sĕppīnayyā

(||inni||)
sakkadanamulu sūsi sarasamu lāḍidi
pĕkkulāgula radulam̐ bĕnam̐gidi
yikkuvalaṁṭi śhrīveṁkaḍeśha nannu nelidivi
yikkaḍa nā korigalu yīḍerĕnayyā